భ‌క్తి.. శ‌క్తి.. ఇదే క‌దా హిట్టు ఫార్ములా!

చిత్ర‌సీమ‌లో ఒక్కో సీజ‌న్‌లో ఒక్కో ఫార్ములా వ‌ర్క‌వుట్ అవుతుంటుంది. కొన్ని సీజ‌న్ల‌లో ప్రేమ క‌థ‌లు ఆడేస్తుంటాయి. ఇంకొన్ని సార్లు క్రైమ్ కామెడీలు వ‌ర్క‌వుట్ అవుతుంటాయి. ఈ సీజ‌న్ మాత్రం భ‌క్తి, భ‌క్తిల‌దే. డివోష‌న‌ల్ ట‌చ్ ఉన్న సినిమాలు, సూప‌ర్ నేచుర‌ల్ ప‌వ‌ర్ తో ముడి ప‌డి ఉన్న క‌థ‌లు ఈమ‌ధ్య తెగ ఆడేస్తున్నాయి. మొన్న అఖండ‌, నిన్న కార్తికేయ 2, ఈరోజు కాంతార‌… దీనికి అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌లు.

ఈ మూడు సినిమాల్లోనూ భ‌క్తి, శ‌క్తి అనే రెండు కాన్సెప్టులూ ఉన్నాయి. అలాగ‌ని మ‌రీ దేవుడు, ఆచారాలు అని డీప్ గా వెళ్లలేదు. ఆ అంశాల్ని ఎక్క‌డ వాడాలో.. అక్క‌డ వాడుకొంటూ వ‌చ్చారు. హిందుత్వ నినాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అది రాజ‌కీయాల్లో బ‌ల‌మైన సెంటిమెంట్‌. అయితే.. ఇప్పుడు సినిమాల‌కూ ఈ సెంటిమెంట్ బాగా వర్క‌వుట్ అవుతోంది. ఎప్పుడైతే అఖండ‌, కార్తికేయ‌, కాంతార లాంటి క‌థ‌లు వ‌ర్క‌వుట్ అయ్యాయో… ఇప్పుడు ఆ త‌ర‌హా క‌థ‌ల‌కు జల్లెడ ప‌డుతున్నారు. సుధీర్ బాబు `హ‌రోం హ‌ర‌` కీ డివోష‌న్ ట‌చ్ ఉంది. త్వ‌ర‌లోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. దాంట్లోనూ దైవ శ‌క్తికి సంబంధించిన అంశాలున్నాయి. పైగా ఇలాంటి పాయింట్లు పాన్ ఇండియా వ్యాప్తంగా వ‌ర్క‌వుట్ అవుతాయి. అందుకే ద‌ర్శ‌క నిర్మాత‌లూ, హీరోలూ ఇలాంటి క‌థ‌ల‌పై మ‌క్కువ చూపిస్తున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలం వాడుకొంటూ, ప్రేక్ష‌కుల్ని ఓ స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిన సినిమాల‌కు ఇప్పుడు ఆద‌ర‌ణ బాగుంది. దానికి దేవుడు అనే పాయింట్ కూడా జోడిస్తే… హిట్టు ప‌డిన‌ట్టే. అందుకే ఇంకొన్నాళ్ల పాటు ఈ త‌ర‌హా క‌థ‌లు రాజ్య‌మేల‌బోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సెకండాఫ్ మార్చేసిన విశ్వ‌క్‌

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దాస్ కా ధ‌మ్కీ. ఈ చిత్రానికి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ అందించాడు. త‌ను ఇప్పుడు ఓ కాస్ట్లీ రైట‌ర్‌. ధ‌మాకా చిత్రానికీ త‌నే...

సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ...

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close