తెలంగాణ ప్రభుత్వంలో మరో లొల్లి బయటపడింది. ఈ సారి సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖలో ఈ రచ్చ జరుగుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు , ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రిజ్వీ VRSకు అనుమతి ఇవ్వొద్దని ఆయనపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి లేఖ శారు. అయితే చీఫ్ సెక్రటరీ రిజ్వీ వీఆర్ఎస్ను ఆమోదించారు.
ఎక్సైజ్ శాఖలో హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్ వ్యవహారంపై వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం బాటిళ్లపై అంటించే హోలోగ్రామ్ లేబుల్స్ కోసం రూ.100 కోట్ల విలువైన టెండర్‌ను రిజ్వీ ఆలస్యం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ హోలోగ్రామ్‌లు బార్కోడ్, ఐటీ ట్రాకింగ్ సిస్టమ్‌తో ఉండి, అక్రమ మద్యం వ్యాపారం, నకిలీ బాటిళ్లు, ఎక్సైజ్ పన్ను ఎగవేతలను నిరోధిస్తాయి.
కొత్త టెండర్‌ను రిజ్వీ కావాలని ఆపుతున్నారని మంత్రిఅంటున్నారు. ఫిర్యాదులపై ఎన్నిసార్లు నివేదికలు కోరినా రిజ్వీ ఇవ్వలేదని, మంత్రి బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రిజ్వీ VRS దరఖాస్తు చేశారు, ప్రభుత్వం అక్టోబర్ 31, 2025 నుంచి అమలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని స్థానంలో ఎం. రఘునందన్ రావును ఫుల్ అడిషనల్ చార్జ్‌లో నియమించారు.