జూబ్లిహిల్స్ అభ్యర్థిపై తెలంగాణ బీజేపీ తేల్చుకోలేకపోతోంది. పోటీ చేసే బలమైన అభ్యర్థుల పేర్లు కూడా ప్రచారంలోకి తీసుకురాలేకపోయింది. చివరికి కాంగ్రెస్ పార్టీ నేత బొందు రామ్మోహన్ పేరును చర్చించినట్లుగా లీక్ చేసుకుని మరింత అభాసుపాలు అయింది. బొంతు రామ్మోహన్ తనకు బీజేపీ టిక్కెట్ అవసరం లేదని. .తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి పోటీకి రెడీగానే ఉన్నారు. కానీ ఆయన స్థానంలో మరొకర్ని ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. కీర్తి రెడ్డి అనే మహిళా నేత పేరు కూడా తెరపైకి వచ్చింది. చివరికి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ప్రజల్లో పట్టు ఉన్న లీడర్ ఎవరూ లేరు కాబట్టి.. ఎవరైనా సెలబ్రిటీని రంగంలోకి దించుదామా అని ఆలోచిస్తున్నారు.
సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. అభ్యర్థిని ఖరారు చేయకపోతే .. ఇతర పార్టీల ప్రచారం చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ కోసం బలహీన అభ్యర్థిని రంగంలో దింపుతోందని.. ప్రచారం కూడా పెద్దగా చేయరని నమ్ముతారు. అప్పుడు బీజేపీ ఓటర్లు కూడా బీఆర్ఎస్ ఓటర్లు మళ్లే ప్రమాదం ఉంది. గెలవకపోయినా కనీసం రెండో స్థానాన్ని అయినా బీజేపీ అందుకుంటే.. ఆ పార్టీ బలపడిందన్న నమ్మకానికి రాజకీయం వస్తుంది.