ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ని కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు,కుటుంబ సభ్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే తారకరత్నఆరోగ్యం వస్తున్న రిపోర్టులు, కుటుంబ సభ్యులు చెబుతున్న మాటలు, మీడియాలో వస్తున్న కథనాలు గందరగోళంగా వున్నాయి. మొదటి నుంచి తారకరత్నఆరోగ్యం విషయంగా వుందని వినిపించిన మాట. అయితే ఈ రోజు నందమూరి రామకృష్ణ చెప్పిన మాటలు అభిమానులకు ధైర్యాన్ని ఇచ్చాయి. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఎక్మో ఏమీ పెట్టలేదని.. శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని, న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని, త్వరలోనే తారకరత్న మామూలు మనిషిగా బయటికి వస్తారు’’ చెప్పారు రామకృష్ణ,
ఆయన మాట్లాడిన కాసేపటికే నారాయణ హృదయాలయ డాక్టర్లు విడుదల చేసిన రిపోర్ట్ మాత్రం మళ్ళీ అభిమానులని కలవరపెట్టింది. తారకరత్నఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తాజాగా వైద్యులు వెల్లడించారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స ఇస్తున్నామని, పరిస్థితి క్రిటికల్ గానే వుందని, ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నామని వెల్లడించారు. రామకృష్ణ స్టేట్మెంట్ తో ఊపిరి పీల్చుకున్న అభిమానులు.. ఇప్పుడు తాజా నివేదికతో మళ్ళీ ఆందోళన పడుతున్నారు. తారకరత్న క్షేమంగా తిరిగిరావాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.