డెడ్ సీజన్ కాదు.. టాలీవుడ్ కి హాట్ సీజన్

సాధారణంగా అయితే సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చే ఫిబ్రవరి, మార్చి.. సినిమాలకి డెడ్ సీజన్ అంటారు. మార్చిలో పరీక్షలు, అంతకుముందు ప్రిపరేషన్ ద్రుష్టిలో పెట్టుకొని ఈ రెండు నెలల్లో పెద్ద, మీడియం సినిమాల విడుదలకు అంత ఆసక్తి చూపించరు నిర్మాతలు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా పది ప్రమెసింగ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

ఫిబ్రవరి3 తేదిన ఏకంగా ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇందులో సందీప్ కిషన్ ‘మైఖేల్’ పాన్ ఇండియా మూవీ గా వస్తోంది. ట్రైలర్ ఆసక్తి రేకెత్తించింది. విజయ్ సేతుపతితో పాటు భారీ తారాగణం వుంది. అలాగే బుట్టబొమ్మ (ఫిబ్రవరి4) , రైటర్ పద్మభూషణ్ లాంటి ప్రామెసింగ్ సినిమాలు కూడా వరుసలో వున్నాయి. కలర్ ఫోటోతో ఆకట్టుకున్న సుహాస్ రైటర్ కి కథానాయకుడు. సితార బ్యానర్ నుంచి వస్తోంది బుట్టబొమ్మ. ఇవి కాకుండా తుపాకుల గూడెం, వేయ్ దరువేయ్ అనే చిన్న సినిమాలతో పాటు ప్రేమదేశం రీరిలీజ్ అవుతుంది.

తర్వాత వారం కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ తో వస్తున్నాడు. బింబిసార విజయం తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం మరో విశేషం. ఫిబ్రవరి 17 సమంత, గుణశేఖర్ ల డ్రీం ప్రాజెక్ట్ శాకుంతులం వస్తోంది. అదే రోజు ధనుష్ సార్ సినిమా కూడా వుంది. అదే రోజు విశ్వక్ సేన్ ‘ధమ్కి’ ఇవ్వడానికి రెడీగా వున్నాడు. వీటితో పాటు కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యం’ కూడా 17నే డేట్ లాక్ చేసుకుంది. ఫిబ్రవరిలో నాలుగు ప్రామెసింగ్ సినిమాలు ఒకేడేట్ కి రావడం ఎప్పుడూ జరగలేదు. మొత్తానికి అన్ సీజన్ అనుకున్న ఫిబ్రవరి.. ఇప్పుడు తెలుగు సీజన్ కి హాట్ సీజన్ గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముక ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన...

ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి...

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close