ఇలియానా అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఇలియానా. ‘ఒక రోజులో చాలా మారవచ్చు. కొంతమంది లవ్లీ డాక్టర్లు, మూడు బ్యాగుల IV ఫ్లూయిడ్స్!’ అంటూ.. తన కండీషన్ అప్ డేట్ చేసింది. దాంతో ఇలియానాకు ఏమైందన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి వెంటనే మరో ఫోటోను షేర్ చేసిన ఇలియానా తన హెల్త్ అప్డేట్‌ను అందించింది. “నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలా మంది నాకు మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ ప్రేమను పొందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకొన్నాను. సకాలంలో సరైన, మెరుగైన వైద్యం లభించింది’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం `ఫెయిర్ అండ్ లవ్లీ` అనే చిత్రంలో నటిస్తోంది ఇలియానా. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా ప్రేమలో ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే.. ఆ లవ్ స్టోరీకి కూడా పుల్ స్టాప్ పడినట్టు టాక్.