ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా ఉంది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ సోషల్ మీడియాలో స్పందించారు. మిథున్ రెడ్డి కేవలం ఓ పావు మాత్రమేనని అసలు.. సూత్రధారులు జగన్, భారతిలేనని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో కోటి పేద కుటుంబాలను నాశనం చేసిందని మండిపడ్డారు.
ఈ సారి అవకాశం వచ్చింది కదా అని చేసింది కాదని.. ఓ ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారం చేసిన టాప్-డౌన్ ఆపరేషన్. అన్నారు. లిక్కర్ తయారి, పంపిణి, లంచాలు సూట్ కేసు కంపెనీలు.. ఇలా దోపిడీని చట్టబద్ధం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారన్నారు. నకిలీ ఇన్వాయిస్లు , ప్పందాల ద్వారా కమీషన్లు ఇచ్చారు. డబ్బును లాండరింగ్ చేయడానికి హైదరాబాద్, బెంగళూరు , విశాఖపట్నంలలో షెల్ కంపెనీలను ప్రారంభించారన్నారు. రవాణా, గిడ్డంగుల ఒప్పందాలను కూడా ప్రాక్సీ సంస్థలకు ఇచ్చారన్నారు. వీటిని లాజిస్టిక్స్ ఖర్చులుగా చూపించారు – వాస్తవానికి, అవి నల్లధనాన్ని వైట్ గా మార్చుకున్న మార్గాలన్నారు.
2020–2024 మధ్య కనీసం 3,200 కోట్లు మళ్లించారని సిట్ చెబుతోందన్నారు. ఇందులో ఒక భాగం 2024 ఎన్నికల ప్రచారానికి.. నియోజకవర్గాలలో నగదు , ఉచిత మద్యంగా పంపిణీకి, ఓటు కొనుగోలు, బూత్ నిర్వహణ కోసం ఉపయోగించారన్నారు. మిధున్ రెడ్డి చీఫ్ ఆపరేటర్‌గా వ్యవహరించారని.. ఎక్సైజ్ శాఖ , రాజకీయ కార్యాలయాల మధ్య సమన్వయం చేయడంలో ఆయన సహాయం చేశారన్నారు.
ఇది జగన్ మొదటి స్కామ్ కాదని మాణిగం ఠాగూర్ గుర్తు చేశారు. సీబీఐ దాఖలు చేసిన ర. 43,000 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ఆయన ఇప్పటికే ప్రధాన నిందితుడన్నారు. ఆయన 2012లో అరెస్టు అయ్యి 16 నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. జగన్‌కు అవినీతి కొత్త కాదు. ఆయన పనిచేసే విధానం అదేనేన్నారు. బీజేపీ కూడా ఈ స్థాయిలో వైసీపీ లిక్కర్ స్కాంపై మాట్లాడటం లేదు. కానీ కాంగ్రెస్ మాత్రం సీరియస్ గా తీసుకుంది.