సైన్యంపై బీజేపీ, కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్స్ ..!

సైన్యాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదనేది.. .మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని కీలకమైన అంశం. అయితే.. ఎన్నికల సంఘం హ్రస్వ దృష్టి పుణ్యమా అని… ఇప్పుడా కోడ్‌ను ఎవరూ లెక్క చేయడం లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు.. సైన్యం పరాక్రమాలనే.. చూపిస్తూ.. ఓట్లు అడుగుతున్నారు. సైన్యం అంటే.. బీజేపీ సొంతమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ను.. తమ బ్రాండ్‌గా చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అసలు రగడ ప్రారంభమయింది. వీరిని ఎన్నికల కమిషన్ అడ్డుకోలేకపోవడంతో… కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. దేశ రక్షణ , దేశ భద్రత వంటి కీలకమైన అంశాల్లో సీక్రెట్‌గా ఉంచాల్సిన అనేక విషయాలను మోడీ సర్కార్ బయట పెడుతూ… తమ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటోందని మండి పడుతోంది. అయితే అలాంటి విషయాలు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడతాయనుకుంటే.. తామూ వెనుకడుగు వేయబోమని.. నిరూపించింది.

యూపీఎ హయాంలో.. జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించిన వివరాలను కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది. తేదీలు… స్థలం సలహా… వివరాలు వెల్లడించింది. అంతే.. కాదు.. వాజ్‌పేయి హయాంలోనూ.. రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశారని.. కానీ ఆయన కూడా బయటకు చెప్పుకోలేదనే వివరాలు బయట పెట్టారు. అయితే … భారతీయ జనతా పార్టీ.. దీన్ని అంత తేలిగ్గా ఒప్పుకునే రకం కాదుగా..! వెంటనే.. మోడీనే రంగంలోకి దిగి.. కాంగ్రె‌స్ అబద్దం చెబుతోందని తేల్చేశారు. ఆ తర్వాత బీజేపీకి మద్దతుగా… రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందిన కొంత మంది సైనికాధికారులు.. కూడా… జోక్యం చేసుకున్నారు. అక్కడితే ఆగిపోతే.. బీజేపీది పై చేయి అవుతుంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీ కూడా.. కొంత మంది ఆర్మీ మాజీ అధికారుల్ని రంగంలోకి దింపింది. తమ హయాంలో జరిగాయని చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర పోషించిన వారి స్టేట్‌మెంట్లు రిలీజ్ చేస్తోంది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా ఇలాంటి ప్రకటనే చేశారు.

నిజానికి భారత సార్వత్రిక ఎన్నికల్లో భద్రతా బలగాల పాత్ర.. భద్రతకే పరిమితం అవుతుంది. కానీ ఈ సారి రాజకీయం అవుతంది. సైనికులు చేసిన పోరాటాలను.. తమ కీర్తిగా చెప్పుకోవడానికి.. రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. మిలిటరీ ఆపరేషన్లను రాజకీయం చేయడం వల్ల భద్రతా బలగాలకు ఎటువంటి లాభం చేకూరదు. దీర్ఘకాలంలో ఆ వ్యవస్థకు నష్టం చేకూరే అవకాశం ఉంది. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం… సైన్యాన్ని వాడుకుంటూనే ఉన్నారు. ఇది.. ఓ రకంగా.. సైన్యంపై.. రాజకీయ పార్టీలు చేస్తున్న సర్జికల్ స్ట్రైక్స్ గా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close