తెదేపా, కాంగ్రెస్‌.. కలిసి ఎదుర్కొంటే సరి!

”శత్రువుకు శత్రువు.. మిత్రుడు” అనే పురాతనమైన సిద్ధాంతం ఇంతకూ ఇప్పుడు పనిచేస్తుందా లేదా?

”ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మోసం చేసి గెలిచారు. నారాయణఖేడ్‌లో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి” అనే ఆరోపణలు మరియు డిమాండ్‌లలో సారూప్యత ఉన్నప్పుడు.. అదే డిమాండ్‌తో ప్రొసీడ్‌ అయ్యే పార్టీలు కలిసికట్టుగా పోరాడవచ్చు కదా?

లాంటి సందేహాలు ఇప్పుడు జనానికి కలుగుతున్నాయి. అవును మరి.. తెరాసను నిందిస్తూ తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒకే రకమైన ఫిర్యాదులు, డిమాండ్లతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య ఇంత భావసారూప్యత ఉన్నప్పుడు.. కలిసే తెరాస మీద పోరాడవచ్చు కదా? విడివిడిగా చేసే పోరాటం కంటె.. కలసికట్టుగా కలబడితే లాభం ఉంటుందికదా అనే సలహాలు కూడా వినిపిస్తున్నాయి.

గ్రేటర్‌ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరిగ్‌కు పాల్పడడం ద్వారా తెరాస సాంకేతిక అరాచకత్వానికి పాల్పడిందంటూ విపక్షాలు రెండూ ఆరోపణలకు దిగాయి. ఈవీఎంల్లో గ్రేటర్‌ ఎన్నికల్లో ‘నోటా’ బటన్‌ను తొలగించడం మీద కూడా అనేక ఆరోపణలు గుప్పించారు. తెరాస ముందే చెప్పుకున్నట్లుగా కచ్చితంగా వంద గెలవడం అనుమానంగా ఉన్నదని వారనడం హాస్యాస్పదమైన సంగతి. నిజానికి గతంలో చంద్రబాబు హయాంలో ఈవీఎంలు మొదలైన రోజుల్లో అసలే హైటెక్‌ బాబుగా పేరున్న చంద్రబాబు ఏదో తిమ్మిని బమ్మిని చేసేస్తారంటూ అనేక పుకార్లు వచ్చాయి. పలుసందర్భాల్లో నాయకులు అనుమానాలు వ్యక్తంచేసి… మెషిన్లను పరీక్షించారు. ప్రతిసారీ వారి అనుమానాలు తుస్సుమన్నాయి. ఇప్పుడు అదే ఆరోపణలతో రెండు పార్టీలూ ఎన్నికల సంఘం వద్దకు ధ్వజమెత్తుతున్నాయి.

తెరాసను ఎదుర్కొనడంలో ఇంతగా.. భావసారూప్యతతో పోరాడుతున్న ఈ రెండు పార్టీలో కలిసే తలపడితే పోదా? అని పలువురు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన విపక్షాలన్నీ కలిసి ఒకే డిమాండ్‌తో వస్తే గనుక.. ఎన్నికల సంఘం లోనూ కాస్త చలనం రావొచ్చు. వీరికి ఒకవైపు అలాంటి సలహాలు వస్తోంటే.. మరోవైపు తెరాస అభిమానులు మాత్రం.. ”అవును , రాబోయే ఎన్నికల్లో కూడా తెదేపా, కాంగ్రెస్‌, భాజపా అందరూ కలిసి ఒకే అభ్యర్థిని పోటీకి దింపి తెెరాసను ఎదుర్కొంటేనే బెటర్‌.. అప్పుడు వారికి కనీసం డిపాజిట్‌ అయినా దక్కుతుందేమో” అని సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

HOT NEWS

[X] Close
[X] Close