హరీష్‌లో కొట్టొచ్చినట్లుగా అసహనం!

తెరాసలో అంతర్గతంగా లుకలుకలు పొడసూపుతున్నాయా? పార్టీలో ఆధిపత్యపోరాటం నెమ్మదిగా రాజుకుంటూ ఉన్నదా? ఇది కొత్త చర్చ కాకపోయినప్పటికీ.. ఇప్పుడు పాకాన పడుతున్నదా? అంటే అవుననే అనిపిస్తోంది. సాధారణంగా ఎప్పుడు కేబినెట్‌ సమావేశాలు జరిగినా.. ఆ పిమ్మట మీడియాతో మాట్లాడడానికి ఉత్సాహంగానే స్పందిస్తూ ఉండే మంత్రి హరీష్‌రావు.. ఈ దఫా రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్‌ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడకుండా మొహం చిరచిర లాడించుకుంటూ వెళ్లిపోవడం, ఆయనతో సన్నిహితులతో చేసినట్లుగా ప్రచారంలోకి వస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయి.

మొన్నటికి మొన్న కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఆ కేబినెట్‌ భేటీలోనే తనయుడు కేటీఆర్‌కు పురపాలక శాఖ మంత్రిగా పట్టం కట్టడం కూడా జరిగింది. పురపాలక శాఖ చాలా కీలకమైనది గనుక.. తన వద్దనే ఉంచుకుని, స్వయంగా తానే పర్యవేక్షిస్తానంటూ గతంలోనే ప్రకటనలు చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు దానిని కేటీఆర్‌ చేతిలో పెట్టారు.

చిన్న హైడ్రామా తర్వాత పట్టాభిషేకం!

పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్‌కు పట్టాభిషేకం కార్యక్రమం ముందు వెనుక చిన్న హైడ్రామా చోటు చేసుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తున్నది. గ్రేటర్‌లో గెలిస్తే.. ఆయనకు ఆ శాఖ ఇస్తానని బహిరంగ సభ వేదికపైనే కేసీఆర్‌ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన జీవో మధ్యాహ్నానికి ముందే సిద్ధమైపోయింది. విడుదల చేయకుండా ఆపారు. దానికి తోడు ఆ ముందురోజే తండ్రి వారసత్వం అన్నయ్య కేటీఆర్‌కే దక్కుతుందని ఎంపీ కవిత మరోసారి వివాదాన్ని రాజకీయ వర్గాల్లో చర్చకు పెట్టారు. సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జరిగింది. కేబినెట్‌ భేటీలో ఈ అంశం చర్చకు రావడం, ఎవరైనా అసహనం వ్యక్తం చేయడం లాంటివి జరగకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు. కేబినెట్‌ భేటీ ముగిసిపోయాక జీవో విడుదల చేశారు.

హరీష్‌లో అసహనం

అయినా ఒక నిర్ణయం మీద నేతల అసహనం కలిగే పరిస్థితి వస్తే.. ఇలాంటి చర్యల వల్ల అది ఆగదు. అదికాస్తా హరీష్‌రావు మొహంలో స్పష్టంగానే కనిపించిందని.. మీడియా పాయింట్‌ వద్ద వేచి ఉన్న వారంతా వ్యాఖ్యానించుకోవడం విశేషం. కేబినెట్‌ భేటీ అయ్యాక.. హరీష్‌రావును కామెంట్స్‌ అడిగినప్పుడు.. ఆయన పట్టించుకోకుండా.. అయిష్టంగా, వెళ్లిపోయారని తెలుస్తున్నది. నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక బాద్యతల ఒత్తిడిలో ఉన్నారని ఒక స్థాయి వరకు సరిపెట్టుకోవచ్చు గానీ.. నిజానికి హరీష్‌లో అసహనానికి కారణం ఏమిటో ఎవ్వరూ ఊహించలేనిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు...

అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని...

13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెబుతారా..?: చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో... టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో...వైసీపీ సర్కార్ ఏం చేసిందో...

మీడియా వాచ్‌: తీవ్ర సంక్షోభంలో ‘ఈనాడు’

తెలుగులో అగ్ర‌గామి దిన‌ప‌త్రిక ఈనాడు. ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్‌గా చ‌లామణీ అవుతోంది. అయితే... క‌రోనా నేప‌థ్యంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా ఉప‌ద్ర‌వానికి ముందు ఈనాడు...

HOT NEWS

[X] Close
[X] Close