రాంజెత్మలానిని పెట్టుకోవలసిన అవసరమేముంది: కాంగ్రెస్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలుచేసిన పిటిషన్‌పై వాదించటంకోసం సుప్రసిద్ధ న్యాయవాది రాంజెత్మలానిని తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం తప్పుచేసింది కాబట్టే తప్పించుకునేందుకు రాంజెత్మలానిని రంగంలోకి దించిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాలే కూలిపోయే అవకాశం ఉందికాబట్టి కేసీఆర్ ప్రభుత్వం భయంతోనే గంటకు లక్షలలో ఫీజును తీసుకునే న్యాయవాదిని దించిందని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్రవెంకటరమణారెడ్డి ఆరోపించారు.

ఏది ఏమైనా మొదట్లో ట్యాపింగే చేయలేదని మీడియాముందు చెప్పిన తెరాస ప్రభుత్వం, ఇప్పుడు న్యాయస్థానంముందు అంగీకరించటంతో ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయిందని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరిగిందా, లేదా అనేది న్యాయస్థానాలు తేల్చాల్సిఉంది. దేశభద్రతకు ముప్పు ఏర్పడేటటువంటి కేసులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే ట్యాపింగ్ చేయాలని చట్టం పేర్కొంటోంది. ఈ కేసులోకూడా అనుమతికోసం కేంద్రానికి లేఖ రాయటంవరకు నిబంధనల ప్రకారమే జరిగింది. అయితే కేంద్రంనుంచి అనుమతి రాకుండానే ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టారని, ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఫోన్‌నుకూడా నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేశారన్నది ఆరోపణ. ఇది ఎంతవరకు నిజమనేది న్యాయస్థానంలో తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

బాలినేనిది బ్లాక్‌మెయిలింగే ?

జగన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కర్ని వదులుకున్నా అది జగన్ రెడ్డికి నైతిక దెబ్బే అవుతుంది. ముఖ్యంగా బాలినేని లాంటి...

జానీ మాస్ట‌ర్ కేస్‌: కొరియోగ్రాఫ‌ర్ల అత్య‌వ‌స‌ర మీటింగ్

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై హ‌త్యాచార కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఓ మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు నార్సింగ్ పోలీసులు జానీ మాస్ట‌ర్ పై విచార‌ణ చేప‌ట్టారు. అయితే జానీ...

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం – రేవంత్ వార్నింగ్

ప్రపంచంతో భారత్ పోటీ పడుతుందంటే కారణం మజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసింది ఆయనేనని చెప్పుకొచ్చారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close