అనంతపురం ఘటనపై లబ్ది పొందటానికి కాంగ్రెస్ యత్నం

హైదరాబాద్: అనంతపురంజిల్లా ఉరవకొండలో కోదండరామిరెడ్డి అనే రైతు నిన్న సిండికేట్ బ్యాంక్ అధికారుల వ్యవహారశైలితో విసుగుచెంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను అనుకూలంగా మలుచుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఆత్మహత్యకు చంద్రబాబు సర్కారే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు రైతులను పూర్తిగా ముంచేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దళిత ఎంపీని సంజాయిషీ అడిగిన బాబు ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని రఘువీరా ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close