బెయిల్‌‌రద్దుకు ‘సుప్రీం’ నిరాకరణ: కేసీఆర్‌కు చెంపపెట్టని టీడీపీ వ్యాఖ్య

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో వాదించటంకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రఖ్యాత న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ కేసులో ఇంకా సాక్షులను విచారించాల్సిఉందని సిబల్ వాదించారు. అరెస్టయిన ఒక్కరోజులో బెయిల్ వస్తే పరిశీలించాలని, కానీ నిందితుడు 30 రోజులు జెయిల్‌లో ఉన్నాడని న్యాయమూర్తి అన్నారు. సెక్షన్ 164కింద వాంగ్మూలం రికార్డ్ చేశారనికూడా గుర్తు చేశారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొన్నారు. రేవంత్ తరపున మరో ప్రముఖ న్యాయవాది రాంజెత్మలాని వాదించారు.

మరోపైపు రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయటం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టని తెలుగుదేశం తెలంగాణ నేత రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు అన్ని కార్యక్రమాలూ నిలిపేసి రేవంత్ రెడ్డి కేసును సింగిల్ పాయింట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుబ్రహ్మణ్య.. ఏదో గట్టి ప్లానే

రవిశంకర్ ఆల్ రౌండర్. యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకి ప్రతిభ వుంది. ఇప్పుడు ఆయన తనయుడు అద్వాయ్ ని తెరకి పరిచయం చేస్తున్నారు. స్వయంగా రవిశంకర్ దర్శకత్వం...

మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తులా… రేవంత్ స‌ర్కార్ కు తెల్ల‌రేష‌న్ కార్డులిచ్చే ఆలోచ‌న ఉందా?

తెలంగాణ‌లో తెల్ల రేష‌న్ కార్డుల సంగ‌తి రేపు మా ఇంట్లో ల‌డ్డూల భోజ‌నం క‌థ‌లా మారింది. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో కొత్త కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూశాయి. పెళ్లిళ్లు అయి,...

జానీ మాస్ట‌ర్ స‌స్పెండ్… వైసీపీకి జ‌న‌సేన‌కు ఇదీ తేడా!

రాజ‌కీయాల్లో మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతాం అంటూ ప్ర‌క‌టించే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్... త‌ను చెప్పిన మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై వేధింపుల విష‌యంలో పార్టీ...

మల్లాది మౌనం..జంపింగ్ కోసమేనా?

వైసీపీ సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అధికారం ఉన్నన్నాళ్లు లౌడ్ స్పీకర్ లాగా చెలరేగిపోయిన సీనియర్లు.. అధికారం కోల్పోయాక కిక్కురుమనడం లేదు. వైసీపీ అనుకూల మీడియాలో తరుచుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close