కవిత ఆశలు అడియాశలేనా!

హైదరాబాద్: ఎప్పుడెప్పుడు కేంద్రమంత్రి అవుదామా అని ఉవ్విళ్ళూరుతున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆశలు అడియాశలుగానే మిగిలిపోయేటట్లున్నాయి. కేంద్రంపట్ల తటస్థవైఖరిని అవలంబించిన టీఆర్ఎస్, అకస్మాత్తుగా స్వరం పెంచింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష ఉపనేత వినోద్ నిన్న చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఏడాదిపాటు ప్రజలు నరేంద్రమోడిని విశ్వసించారని, కానీ ఇప్పుడు ఆ నమ్మకం క్రమంగా కోల్పోతున్నారని వినోద్ వ్యాఖ్యానించారు. ముగ్గురు కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, దీనిపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన విషయాలలోనూ ప్రధాని వైఖరితో తాము విశ్వాసం కోల్పోతున్నామని అన్నారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకూ వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నవిషయాన్ని గుర్తు చేస్తూ, దీనిపై రెండునెలల్లో హైకోర్టు విభజన చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, నేటికీ అది ఆచరణ దాల్చలేదని చెప్పారు. ప్రధాని మోడి చంద్రబాబును బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు. అటు తెలంగాణ దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికూడా మోడి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి చూపిస్తోందని ఆరోపించారు. మొత్తంమీద చూస్తే కేంద్రం విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఘర్షణపూరితంగానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశాలు మృగ్యమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మరి కేంద్రమంత్రి కావాలని కలలు కంటున్న కవిత ఆశలు అడియాశలుగానే మిగిలిపోయేటట్లున్నాయి…పాపం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

ఏడున్న‌ర ఎక‌రాల్లో అల్లు స్టూడియోస్‌

తెలుగు చిత్ర‌సీమ‌కు స్టూడియోల కొద‌వ లేదు. అన్న‌పూర్ణ, రామానాయుడు, ప‌ద్మాల‌యా, సార‌ధి.. ఇలా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స‌గం షూటింగులు...

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత...

గంటా కూడా కుమారుడికే వైసీపీ కండువా కప్పించబోతున్నారు..!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. గతంలో చాలా సార్లు ముహుర్తం పెట్టుకున్నారు కానీ... వైసీపీ నేతల్ని బుజ్జగించడం ఆలస్యమయింది. వారం రోజుల్లోఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని...

HOT NEWS

[X] Close
[X] Close