రాజధానిలో కాంగ్రెస్ ఖతమేనా…!?

కాంగ్రెస్. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని ఏలిన పార్టీ. అతిరథ మహారధులున్న పార్టీ. తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు కలిగిన పార్టీ. ఇన్ని విశేషణాలున్న పార్టీ నేడు దీనావప్థకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అక్కడ నా అనేవారే లేకుండా పోయారు.

ఢిల్లీలో అంతకంతకు తన ప్రతిష్టను, ఓటు బ్యాంకును కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్పార్ధకంగా మారే పరిస్థితి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్నాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలోలనూ పట్టు కోల్పోయింది. ఇప్పుడు ఇదే పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీలో కూడా కనిపిస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్ధానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో అయితే ఏకంగా ఓటింగ్ శాతాన్ని కూడా కోల్పోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి 9 శాతం ఓట్లు వస్తే ఈసారి అది నాలుగు శాతానికి పడిపోవడం ఆ పార్టీ దీనావస్థకు తార్కాణం. ఎన్నికల ముందు పార్టీ పరిస్థితిపై అగ్ర నాయకులు ఓ అంచనాకు వచ్చి గెలుపు అసాధ్యమని తేల్చేశారు. దీంతో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తాము ఆప్ కు మద్దతు ఇస్తున్నామంటూ వెనుక నుంచి మద్దతు పలుకుతున్నామని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన వెనుక కాంగ్రెస్ పార్టీ దుస్థితిని అంచనా వేయడమేనని, ఆప్ కు మద్దతు అని ప్రకటించడం ద్వారా తమ లోపాలను కప్సిపుచ్చుకునే ప్రయత్నమేనని ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నాలుగు శాతం ఓట్లు భవిష్యత్ లో పార్టీ ఉనికిని కూడా లేకుండా చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మెరుగైన బీజేపీ ఓటింగ్ శాతం ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగజారితే బీజేపీ పరిస్థితి మాత్రం మెరుగ్గానే ఉంది. గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించడమే కాకుండా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంది భారతీయ జనతా పార్టీ. తగ ఎన్నికల్లో ఆ పార్టీకి 35 శాతం ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో అది నాలుగు శాతం పెరిగి 39 శాతానికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అనేక మంది యోదానుధులను ప్రచార బరిలోకి దింపినా ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. అయితే ఓటింగ్ శాతం పెరగడం బీజేపీ అగ్ర నాయకత్వానికి కాసింత ఉరటనిచ్చిందనే చెప్పాలి. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close