జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేసినట్లుగా కనిపించినా పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బులు పంచుతున్నారని.. మిక్సీలు, కుక్కర్లు పంచుతున్నారని.. అాలాగే ఫేక్ ఓటర్ కార్డులతో ఓట్లేయబోతున్నారని హరీష్ రావు వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆధారాలు కూడా సమర్పించామన్నారు.
ఇలా ఫిర్యాదు చేయడం అంటే.. తాము చేయలేకపోతున్నాం.. వాళ్లు చేసేస్తున్నారు అని కంగారు పడటమే అనుకోవచ్చు.పోలింగ్ ముందు రోజు ఇలా ఏదైనా పార్టీ గగ్గోలు పెట్టిందంటే.. ఆ పార్టీ వెనుకబడిపోయిందని ఎక్కువ మంది అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బస్తీ బస్తీకి అనుచరగణం ఉంది. అంతకు మించి దశాబ్దాల తరబడి ఉన్న పరిచయాలు ఉంటాయి. వారికి కాంగ్రెస్ బలం అదనం. కావాల్సినంత సపోర్టు సీఎం రేవంత్ రెడ్డివైపు ఉండటంతో పోల్ మేనేజ్ మెంట్ లో వారు తమదైన స్టైల్ పాటిస్తున్నారని అంటున్నారు.
తాయిలాలు పంచడం వరకూ ఓకే కానీ.. సపోర్టర్లు అందర్నీ పోలింగ్ బూత్ వద్దకు తీసుకు వచ్చి ఓటేయించుకోవడమే అసలు పోలింగ్ మెనేజ్మెంట్ .ఈ విషయంలో ఏ పార్టీ విజయవంతమైతే ఆ పార్టీకి ప్లస్ గా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున.. ఆ పార్టీ స్థానిక క్యాడరే ఈ బాధ్యతలు మోయాల్సి ఉంది. వారు నవీన్ యాదవ్ కు సరెండర్ అయిపోతే .. బీఆర్ఎస్ పార్టీకి సమస్యలు వస్తాయి.
