అన‌ర్హ‌త వేటుతో ఫిరాయింపుల్ని ఆపే ప‌నిలో కాంగ్రెస్‌!

సీల్పీని విలీనం చేసేందుకు అధికార పార్టీ తెరాస వ్యూహాల్లో ఉంటే… దాన్ని ఎలా అడ్డుకోవాలో అనే ప్ర‌య‌త్నంలో కాంగ్రెస్ నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న ప‌రిస్థితిలో ఉన్నారు. తెరాస ప్రారంభించిన ప్ర‌క్రియ ఇంకా విలీనం వ‌ర‌కూ వెళ్ల‌లేదు కాబ‌ట్టి… ఈలోగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేజార‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఇప్ప‌టికే 11 ఎమ్మెల్యేలు తెరాస‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు చేజారితే విలీన ప్ర‌క్రియ షురూ అయిపోయిన‌ట్టే. అయితే, ఈలోగా ఉన్న ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డం కోసం కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే… జంప్ జిలానీల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డేలా స్పీక‌ర్ పై గ‌ట్టిగా ఒత్తిడి తేవ‌డం!

సీఎల్పీ నేత భ‌ట్టితోపాటు ష‌బ్బీర్ అలీ మ‌రికొంద‌రు సీనియ‌ర్ నేత‌లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డిని క‌లుసుకున్నారు. తాజాగా పార్టీ వీడిన న‌లుగురు స‌భ్యుల‌పై అన‌ర్హ‌త వేటు వెయ్యాలంటూ స్పీక‌ర్ ని కోరారు. గ‌త‌వారంలో కూడా స్పీక‌ర్ కి ఇలాంటి పిటీష‌నే ఇచ్చారు భ‌ట్టి. పార్టీ వీడిన ఆరుగురిపై అన‌ర్హ‌త వేటు వెయ్యాల‌ని కోరారు. దానికి అనుబంధంగా ఇవాళ్ల మ‌రో ఫిర్యాదు ఇచ్చారు. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి, ప‌ద‌వికి రాజీనామా చెయ్య‌కుండా మ‌రో పార్టీలో చేరి శాస‌న స‌భ్యులుగా కొన‌సాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై వేటు వేయాలన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని అధికార పార్టీ అప్ర‌జాస్వామ్యంగా ప్రోత్సిహిస్తోంద‌ని భ‌ట్టి విమ‌ర్శించారు. అన‌ర్హ‌త పిటీష‌న్ల‌పై వెంట‌నే స్పందించాల‌ని ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ని కాంగ్రెస్ నేత‌లు కోరారు.

ఓప‌క్క సీఎల్పీ విలీనానికి తెరాస‌ ప్ర‌య‌త్నిస్తుంటే… అన‌ర్హ‌త వేటుపై ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేస్తున్న‌ట్టు..? అంటే, పార్టీ నుంచి బ‌య‌ట‌కి వెళ్తే అన‌ర్హ‌త వేటు త‌ప్ప‌దు అనే సంకేతాలు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల‌కు ఇవ్వ‌డ‌మే దీని వెన‌క ఉద్దేశం కావొచ్చు. అయినా, స్పీక‌ర్ కి ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన జంప్ జిలానీల‌పై అన‌ర్హ‌త వేటు సాధ్య‌మా.? గత అసెంబ్లీలో జంప్ జిలానీలు ఏకంగా ఐదేళ్లూ కొన‌సాగారు క‌దా. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు ఇలానే స్పీక‌ర్ కి చాలా ఫిర్యాదులు చేశారు. అవ‌న్నీ బుట్ట దాఖ‌ల‌య్యాయి! కాబ‌ట్టి, ఈ ప్ర‌య‌త్నం పెద్ద‌గా వ‌ర్కౌట్ కాద‌నేది ఎవ‌రైనా ఇట్టే చెప్పేయ‌గ‌ల‌రు! ఇంకోప‌క్క‌… సీఎల్పీ విలీన ప్ర‌క్రియ‌ను అడ్డుకోవాలంటే న్యాయ‌ప‌రంగా ఏవైనా సాధ్యాసాధ్యాలున్నాయా అనేది కాంగ్రెస్ నేత‌లు అధ్య‌య‌నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దాని కంటే ముందు చెయ్యాల్సింది… ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలను చేజార‌కుండా కాపాడుకోవ‌డం. ఎవ‌రు చెబితే టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ‌ల‌స‌లు ఆగుతాయ‌నేది ప్ర‌స్తుతానికి వారికి కూడా ప్ర‌శ్నార్థ‌కంగానే క‌నిపిస్తోంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close