దుబ్బాకలో పోటీ చేసి తీరుతామంటున్న ఉత్తమ్..!

తెలంగాణలో ఆరు నెలల్లో ఉపఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. అయితే..తెలంగాణలో నిన్నామొన్నటి వరకు ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే..వారి కుటుంబసభ్యులను ఏకగ్రీవంగా గెలిపించుకునే సంస్కృతి ఉండేది. కానీ కేసీఆర్ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. గతంలో పాలేరు.. ఆ తర్వాత నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి ఘన విజయం సొంతం చేసుకున్నారు. అందుకే.. అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ..ఎన్నికను లైట్ తీసుకోవాలని అనుకోవడం లేదు.

నిజానికి టీఆర్‌ఎస్‌లో కన్నా…కాంగ్రెస్‌లోనే దుబ్బాక ఉపఎన్నికలపై ఎక్కువ చర్చ జరుగుతోంది. కొంత మంది సొంత అభిప్రాయాలను చెప్పడం ప్రారంభించారు. జగ్గారెడ్డి లాంటి నేతలు… రామలింగారెడ్డి కుటుంబసభ్యులను నిలబడితే సహకరిస్తామని కూడా చెప్పారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటన్నింటికి తెర దించారు. దుబ్బాకలో పోటీ చేసి తీరుతామని.. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాను చెప్పేదే ఫైనల్ అని…ఇతరులు చెప్పేది వ్యక్తిగత అభిప్రాయాలేనని తేల్చేశారు.

మరో వైపు బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అక్కడ నుంచి గతంలో పోటీ చేసిన రఘునందన్ రావు..ఈ సారితన ప్రయత్నాలను ప్రారంభించేశారు కూడా. అయితే…కాంగ్రెస్‌లోనే ఎప్పట్లానే గందరగోళం కనిపిస్తోంది . త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తే… ఆయన పట్టు సాధిస్తే తప్ప.. ఈ తరహా గందరగోళం మారే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close