అగ్నిప్రమాద ఘటనలో రాయపాటి కోడలికీ నోటీసులు..!

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన విషయంలో రమేష్ ఆస్పత్రిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు పోలీసులు. ఇప్పటికే ఆస్పత్రి చైర్మన్ రమేష్‌కు.. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో గుంటూరు రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ మమతకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. డాక్టర్ మమత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు. విజయవాడ సౌత్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు డాక్టర్ మమత హాజరయ్యారు.

నిజానికి ప్రమాదం జరిగింది విజయవాడలో. స్వర్ణ ఆస్పత్రిలో కోవిడ్ సెంటర్ నిర్వహిస్తోంది కూడా విజయవాడ ఆస్పత్రి ఆధ్వర్యంలోనే. అయినప్పటికీ..గుంటూరు ఆస్పత్రికి సీవోవోగా ఉన్న డాక్టర్ మమతకు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చి పిలిపించి ప్రశ్నించడం రాజకీయ ఆరోపణలకు కారణం అవుతోంది. ప్రభుత్వ వైద్య శాఖ ఉన్నతాధికారులే ప్రముఖ ఆస్పత్రులపై…కోవిడ్ సెంటర్లుగా మరిన్ని బెడ్లను ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చారని.. ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. వందే భారత్ మిషన్ లో భాగంగా..ఏపీకి వస్తున్న వారందరికి హోటళ్లలోనే క్వారంటైన్ ఏర్పాటు చేశారు. ఆ క్వారంటైన్ సెంటర్లనే తర్వాత కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు.

అయితే ఇప్పుడు… స్వర్ణ ప్యాలెస్ కు కోవిడ్ ఆస్పత్రిగా అనుమతులు ఇచ్చిన అధికారులను కనీసం ప్రశ్నించకుండా..వైద్యులను అరెస్ట్ చేయడం… వైద్యలకు నోటీసులు ఇచ్చి… స్టేషన్లకు పిలిపించడం వివాదాస్పదమవుతోంది. సీఆర్పీసీ ప్రకారం ఆస్పత్రి చైర్మన్ రమేష్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. అంతకు రెండు రోజుల ముందు నుంచే పరారీలో ఉన్నారని మీడియాకు చెప్పడం ప్రారంభించారు. రమేష్ ఆస్పత్రి చైర్మన్ ను పట్టుకోవడానికి నియమించాలని చెప్పి.. .తర్వాత నోటీసులు ఇచ్చినట్లుగా మీడియాకు చెబుతున్నారు. పోలీసుల తీరుపై ఇప్పటికే ఆలిండియా మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసి.. పోలీసులకు లేఖ రాసింది. డాక్టర్లను బాధ్యులను చేయడం ప్రాథమిక న్యాయసూత్రాలకు విరుద్ధమని తన లేఖలో స్పష్టం చేసింది. అయినప్పటికీ..పోలీసులు వైద్యులను మాత్రమే టార్గెట్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close