రాముడిపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. అరెస్ట్..!

ఓ వైపు బెంగళూరులో ఓ చిన్న సోషల్ మీడియా పోస్టు సృష్టించిన విధ్వంసం కళ్ల ముందు కదలాడుతూండగానే.. హైదరాబాద్‌లోనూ అలాంటి అలజడి రేపడానికి కత్తి మహేష్ ప్రయత్నించారు. బెంగళూరు ఘటనల తర్వాత మంత్రి కేటీఆర్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా.. సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. కత్తి మహేష్ అలాంటి చిచ్చు పెడితేనే తన గురించి చెప్పుకుంటారని అనుకున్నారేమో కానీ పోస్టులు పెట్టారు.

గతంలోలా రాముడ్ని విమర్శిస్తూ… సోషల్ మీడియాలో విద్వేషం చిమ్మారు. దీంతో వెంటనే.. కత్తి మహేష్‌ని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి..రిమాండ్‌కు తరలించారు. బెంగళూరు కన్నా హైదరాబాద్ ఇంకా సున్నిత ప్రాంతం. గతంలో కత్తి మహేష్ ఇలా రాముడిపై చేసిన హడావుడితో… పరిపూర్ణానంద స్వామి పోటీకి వచ్చారు. ఇద్దర్నీ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు.

ఆ తర్వాత కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నా.. ఇప్పుడు ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉన్న సందర్భంలో మరోసారి అలాంటి పోస్టు పెట్టారు. కేవలం అల్లర్లు రెచ్చగొట్టే ఉద్దేశతోనే..కుట్రతోనే కత్తి మహేష్ ఈ పోస్టు పెట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా చానళ్లలో పబ్లిసిటీ పొందే.. కత్తి మహేష్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్న సూచనలు అందుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close