రియల్ మార్కెట్ లో ఓ స్థలాన్ని ఎంత ఎక్కువకు అమ్ముకుంటే అంత లాభం. మరి విలువలేని స్థలాన్ని అమ్ముకోవాలంటే ఏం చేయాలి.. ఏదో వాల్యూ యాడ్ చేయాలి. అందుకే రియల్టర్లు ఇప్పుడు ఒకే వాల్యూను ఎక్కువగా యాడ్ చేస్తున్నారు. అదేమిటంటే.. వీకెండహోమ్..కంటెయినర్ హౌస్.
ఊరి చివరి ఫామ్ హౌస్.. వారాంతంలో అక్కడికి వెళ్లి కాసేపు గడిపి రావాలని చాలా మందికి కోరిక ఉంటుంది.కానీ అది సాధ్యం కాదు. కానీ అలాంటి కోరికల్ని తాము తీరుస్తామని రియల్టర్లు ప్రచారం చేస్తున్నారు. ఓఆర్ఆర్ దాటి నలభై కిలోమీటర్ల వరకూ వెళ్లి పొలాలను ఫామ్ ప్లాట్ల పేరుతో అమ్మేస్తున్నారు. ఎవరూ కొనే అవకాశం ఉండదు కాబట్టి వీకెండ్ హోమ్స్ అనే కాన్సెప్ట్ తీసుకు వచ్చారు. మీ ప్లాట్ లో ఓ కంటెయినర్ హౌస్ కట్టిస్తామని.. వారాంతంలో ఎంజాయ్ చేసి వెళ్లవచ్చని చెబుతున్నారు. తమ వెంచర్ లో కొన్ని పిల్లలు ఆడుకునే ఏర్పాట్లతో చిన్న పార్కు కూడా పెడుతున్నారు.
కంటెయినర్ హోమ్ ఖర్చుతో కలిపి స్థలాన్ని మంచి వరకే అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ఈ విషయంలో టెంప్ట్ అవుతున్నారు. కానీ ఇలాంటి వాటిలో చాలా వరకూ వచ్చే పదేళ్ల తర్వాత కూడా ఇప్పుడు పెడుతున్నంత పెట్టుబడి తిరిగి రాదు. ఆ వీకెండ్ హోమ్స్ పై ఆసక్తి కూడా .. ఒకటి,రెండు వారాలకే పోతుంది. ఎందుకంటే సరిగ్గా ఎలక్ట్రిసిటీ కూడా అక్కడ ఉండదు. అక్కడికి ఊసూరోమంటూ వెళ్లి.. రావడం ఎందుకన్న భావన వస్తుంది.
ఎలా చూసినా..ఈ ఫామ్ ప్లాట్ల కంటెయినర్ హోమ్స్ అనే ఆకర్షణకు తలొగ్గిస్తే.. కష్టపడి సంపాదించిన లక్షలు ఊరి చివరి పనికి రాని ప్లాట్లలో పెట్టుబడి పెట్టినట్లవుతుంది. ఇలాంటి ప్లాట్లపై పెట్టుబడులు పెట్టే ముందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిదని నిపుణులు సలహాలిస్తున్నారు.