హైకోర్టుకు “సాక్షి కోర్టు ధిక్కార” కేసు ..!

సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు నమ్మకం లేదని బెంచ్‌ను మార్చాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో సీబీఐ కోర్టు జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దుకు సంబందించి తీర్పులను ప్రకటించే అవకాశం ఉంది. సాక్షి మీడియా సీబీఐ కోర్టు తీర్పును ముందుగానే ప్రకటించారని .. ఒక వేళతన తీర్పును సీబీఐ కోర్టు కొట్టి వేస్తే ముందే సాక్షి తీర్పు చెప్పిందని అనుకుంటారని.. అదే సమయంలో విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు కూడా న్యాయమూర్తి అనుమతించారని రఘురామ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అయితే ఈ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

మరో వైపు సాక్షిమీడియా పై రఘురమకృష్ణరాజు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటి,న్‌పై సీబీఐ కోర్టు విచారణ ముగించింది. కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. గత నెల ఇరవై ఐదో తేదీన సీబీఐ కోర్టు తీర్పు రాక ముందే సాక్షి వెబ్ మీడియాలో తీర్పును ప్రకటించారు. ఇది కుట్రపూరితమని .. కోర్టు ధిక్కరణ అని ఆరోపిస్తూ రఘురామ పిటిషన్ వేసారు. దీనిపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. సాక్షి ఎడిటర్‌తో పాటు సీఈవో కూడా విచారణకు హాజరయ్యారు. తమ ఉద్యోగి తప్పిదమేనని వారు వివరణ ఇచ్చారు. విచారణ పూర్తి చేసిన సీబీఐ కోర్టు .. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంది కాబట్టి.. బదిలీ చేస్తున్నట్లుగా తెలిపింది.

జగన్, విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. వారు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ ఇద్దరి బెయిళ్లను రద్దు చేయాలని విడివిడిగా రఘురామ పిటిషన్లు వేశారు. విడివిడిగానే విచారణ పూర్తి చేసిన సీబీఐ కోర్టు తీర్పును వెల్లడించాల్సి ఉంది. ఈ లోపే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ కారణంగా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close