సినిమా వాళ్ల నెత్తిమీద మ‌రో పిడుగు

ఏపీ ప్ర‌భుత్వానికి టాలీవుడ్ అంత ఎంత `ప్రేమ‌` ఉందో… సినీ పెద్ద‌ల‌కు అర్థ‌మ‌వుతూనే ఉంది. టికెట్ రేట్లు త‌గ్గించ‌డం ద‌గ్గ‌ర్నుంచి, ఆ టికెట్లు తామే అమ్ముతాం అన్నంత వ‌ర‌కూ.. ప్ర‌తీసారీ సినిమా వాళ్ల‌పై జ‌గ‌న్ ప్రభుత్వం క‌క్ష సాధిస్తూనే ఉంది. ఇప్పుడు టాలీవుడ్ పెద్ద‌ల‌పై మ‌రో పెద్ద పిడుగు వేయ‌బోతున్న‌ట్టు టాక్‌.

ఆంధ్ర ప్ర‌దేశ్ లో స్టూడియోలు నిర్మించుకోవాల‌న్న ఆశ‌తో చిరంజీవి, నాగార్జున‌, సురేష్ బాబు లాంటి బ‌డా బాబుల‌తో పాటు కనీసం 20, 30 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వంద‌ల ఎక‌రాలు ఇవ్వ‌క‌పోయినా, కనీసం ఒకొక్క‌రికీ 20 -30 ఎక‌రాల స్థ‌లాన్న‌యినా ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లేసుకున్నారు. రెండు మూడు చోట్ల స్టూడియో నిర్మాణానికి అనువైన భూముల్ని కూడా ప్ర‌భుత్వం గుర్తించింది. త్వ‌రలోనే ఆ భూములపై ఓ స్ప‌ష్ట‌త వస్తుంద‌ని, అప్లికేష‌న్ పెట్టుకున్న‌వాళ్లంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ద‌ర‌ఖాస్తుల‌న్నీ ఏపీ ప్ర‌భుత్వం బుట్ట‌ద‌ఖ‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏపీలో ఉచితంగా భూముల్ని ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌ద‌ని, సినిమా వాళ్ల‌కు అస్స‌లు ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం నిర్ణయించుకుంద‌ని స‌మాచారం. ఏపీలో రాజ‌ధాని విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. అక్క‌డ‌ ప్ర‌భుత్వ కార్యాల‌యాలకే భూమి దొర‌కడం లేదు. అలాంట‌ప్పుడు సినిమా స్టూడియోల‌కు ఎందుకు కేటాయించాల‌న్న‌ది వాళ్ల ప్ర‌శ్న‌. కేవ‌లం స్టూడియోల కోసం భూములు ఇస్తార‌న్న ఆశ‌తో.. చిత్ర‌సీమ‌లోని కొంత‌మంది పెద్ద‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి కామెంట్లూ చేయ‌కుండా, మౌనంగా ఉంటూ వ‌చ్చారు. టికెట్ రేట్లు త‌గ్గించిన‌ప్పుడూ, టికెట్లు మేమే అమ్ముతాం అన్న‌ప్పుడు కూడా ఎవ‌రూ స్పందించ‌నిది అందుకే. ఇప్పుడు భూములు రావ‌ని తెలిస్తే.. ప్ర‌భుత్వంతో అవ‌స‌రం ఏముంది? ఇక మీద‌ట‌.. సినీ పెద్ద‌ల ఆలోచ‌న విధానం, ప్ర‌భుత్వంపై వైఖ‌రి.. రెండూ మారిపోతాయేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close