వెట‌ర‌న్ భామ‌ల‌కూ… డిమాండ్‌!

చిత్ర‌సీమ‌కు జ్ఞాప‌క‌శ‌క్తి చాలా త‌క్కువ‌. ట‌చ్ లో లేకుండా పోతే… అంతా మ‌ర్చిపోతారు. అందుకే తార‌లంతా చిన్న‌దో, పెద్ద‌దో ఏదో ఓ సినిమా చేస్తూ.. `మేం కూడా ఉన్నాం` అని చెప్పుకోవాల్సిందే. అయితే ఈ గ్యాప్ మ‌రీ ఎక్కువైతే ఆ చిన్న అవ‌కాశం కూడా ఉండ‌దు. మ‌రీ ముఖ్యంగా క‌థానాయిక‌ల‌కు. అయితే.. ఈ సీజ‌న్‌లో మాత్రం కొంత‌మంది వెట‌ర‌న్ క‌థానాయిక‌లు తెలుగు తెర‌పై మ‌ళ్లీ క‌నిపించ‌బోతున్నారు. వాళ్లు అవ‌కాశాల్ని వెదుక్కుంటూ రావ‌డం కంటే, వాళ్లనే అవ‌కాశాలు వెదుక్కుంటూ వెళ్ల‌డం… ఈసారి చెప్పుకోద‌గిన పెద్ద విష‌యం.

పెళ్ల‌య్యాక‌… క‌ల‌ర్ స్వాతి ఇక సినిమాల్లో న‌టించ‌దు అనుకున్నారు. కానీ.. ఇప్పుడు `కార్తికేయ 2`లో త‌ను న‌టిస్తోంది. ఈ సినిమాలో అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన నాయిక‌. అయితే `కార్తికేయ`లో క‌నిపించిన స్వాతి…. పార్ట్ 2లోనూ ఉండాల‌ని ద‌ర్శ‌కుడు భావించ‌డంతో స్వాతిని ఈ సినిమాలో ఏరి కోరి తీసుకోవాల్సివ‌చ్చింది. ఇప్పుడు త‌న‌కు ఓ వెబ్ సిరీస్ ఆఫ‌ర్ కూడా వ‌చ్చింద‌ట‌. మ‌రోవైపు `ఆవ‌కాయ్ బిర్యానీ` హీరోయిన్ బిందు మాధ‌వి మ‌రోసారి ట‌చ్‌లోకి వ‌చ్చింది. సినిమా బండి ఫేమ్ వికాస్ వ‌శిష్ట క‌థానాయ‌కుడిగా రూపొందే ఓ సినిమాలో… బిందు మాధ‌వి హీరోయిన్‌. ఇక టాలీవుడ్ కి అప్పుడ‌ప్పుడూ ట‌చ్‌లో ఉండే అంజ‌లి.. ఇప్పుడు ఓ భారీ ఆఫ‌ర్ ని ప‌ట్టేసింది. రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందించే సినిమాలో అంజ‌లిది కీల‌క పాత్ర‌. ర‌విబాబు సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ‌… `అఖండ‌`లో కీల‌క పాత్ర పోషిస్తోంది. త‌న కోసం కొన్ని లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లు సిద్ధం అవుతున్నాయి. `బ్యాక్ డోర్‌` అనే సినిమా విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఇలా… వెట‌ర‌న్ ముద్ర ప‌డిపోయిన క‌థానాయిక‌ల‌కు ఇప్పుడు కొత్త‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మున్ముందు ఈ జాబితాలో ఇంకెంత‌మంది చేర‌తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close