ఈవారం బాక్సాఫీస్‌: ‘గ‌ల్లీ రౌడీ’తో ‘మాస్ట్రో’ ఫైట్‌

అటు థియేట‌ర్‌, ఇటు ఓటీటీ – సినీ ప్రేక్ష‌కుల‌కు రెండు వైపుల నుంచీ వినోద‌మే. థియేట‌ర్లు తెర‌చుకోవం, క‌రోనా భ‌యాలు కాస్త కాస్త త‌గ్గ‌డంతో – ప్రేక్ష‌కులు మ‌ళ్లీ టికెట్ కౌంట‌ర్ల ముందు క్యూ క‌డుతున్నారు. `సిటీమార్‌` సినిమాకి వ‌చ్చిన స్పంద‌న – మిగిలిన నిర్మాత‌ల‌లో ఉత్సాహం నింపుతుండ‌డంతో ఇక మీద‌ట మ‌రిన్ని సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవ్వ‌బోతున్నాయి. ఈ శుక్ర‌వారం అయితే, అటు ఓటీటీలోనూ, ఇటు వెండి తెర‌పైనా కొత్త సినిమాల జాత‌ర క‌నిపించ‌బోతోంది.

నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `మాస్ట్రో` ఈ వార‌మే విడుద‌ల అవుతోంది. అయితే… ఓటీటీలో. డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమా హ‌క్కుల్ని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త వారం ఓటీటీలో నాని `ట‌క్ జ‌గ‌దీష్‌`గా ద‌ర్శ‌న‌మిస్తే ఈసారి నితిన్ `మాస్ట్రో` వంతు వ‌చ్చింది. బాలీవుడ్ `అంధాధూన్` చిత్రానికి ఇది రీమేక్‌. త‌మ‌న్నా, న‌భాన‌టేషాల గ్లామ‌ర్ ఈ సినిమాకి మ‌రింత ప్ల‌స్ కానుంది. ఇక అదే రోజున థియేట‌ర్ల‌లో `గ‌ల్లీ రౌడీ` సంద‌డి చేయ‌బోతున్నాడు. సందీప్ కిష‌న్ – జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబోలో రూపొందిన సినిమా ఇది. నాగేశ్వ‌రరెడ్డి కామెడీ టైమింగ్ బాగుంటుంది. మంచి క‌థ ఎంచుకుంటే క‌చ్చితంగా హిట్ కొట్ట‌గ‌ల ద‌మ్ముంది. ప్ర‌చార చిత్రాలు బాగుండ‌డంతో – ఈ సినిమాపై అంద‌రి దృష్టీ ప‌డింది. ఇదే రోజున విజ‌య్ ఆంటోనీ `విజ‌య్ రాఘ‌వ‌న్‌`, హ‌ర్బ‌జ‌న్ సింగ్ తెరంగేట్రం చేసిన `ఫ్రెండ్ షిప్‌`, జెమ్‌, ప్లాన్ బి, హ‌నీ ట్రాప్ సినిమాలు థియేట‌ర్ల‌లోనే రాబోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close