త్రివిక్ర‌మ్ పై ప‌వ‌న్ మ‌రో బాధ్య‌త‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్ ల దోస్తీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? ప‌వ‌న్ అంటే త్రివిక్ర‌మ్.. త్రివిక్ర‌మ్ అంటే ప‌వ‌న్‌. ఈ విష‌యం వాళ్ల అభిమానుల‌కూ తెలుసు. ప‌వ‌న్ సినిమా (భీమ్లా నాయ‌క్‌) కోసం… మ‌హేష్ తో త‌న సొంత సినిమా ప‌నుల్ని ప‌క్క‌న పెట్టేశాడు త్రివిక్ర‌మ్‌. త్రివిక్ర‌మ్ సెట్లో ఉంటేగానీ.. త‌న‌కు కుద‌ర‌ద‌ని అల్టీమేట్టం జారీ చేశాడు ప‌వ‌న్‌. ఇదీ… వాళ్ల బంధం. ప‌వ‌న్ కి సంబంధించిన చాలా వ్య‌వ‌హారాలు త్రివిక్ర‌మ్ స‌ర్దుబాటు చేస్తుంటారు. తాజాగా ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ పై మ‌రో బాధ్య‌త వేసిన‌ట్టు టాక్‌.

ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ ని మ‌ళ్లీ…. ట్రాక్ లో పెట్టాల‌న్న‌ది ప‌వ‌న్ ఉద్దేశ్యం. ఓటీటీ హ‌వా న‌డుస్తోంది క‌దా. వాటి కోస‌మైనా చిన్నా చిత‌కా సినిమాలు చేయాల‌ని, చ‌ర‌ణ్ తో ఓ భారీ సినిమా చేయాల‌ని, నితిన్ తో కూడా ఓ సినిమా చేయాల‌ని.. ఇలా ర‌క‌ర‌కాల ప్లాన్స్ ఉన్నాయి. ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ మైండ్ లో ఉన్న ఆలోచ‌న‌లు ఇవి. ఇప్పుడు ఈ బాధ్య‌త త్రివిక్ర‌మ్ పై పెట్టార్ట. క‌థ‌లు విన‌డం, ద‌ర్శ‌కుల్ని సెలెక్ట్ చేయ‌డం, ప్రాజెక్టు ప‌ట్టాలెక్కించ‌డం… ఇవ‌న్నీ త్రివిక్ర‌మ్ బాధ్య‌త‌లు. మ‌హేష్ తో సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ కోసం ఓ క‌థ‌ని సెలెక్ట్ చేసి, సినిమాని ప‌ట్టాలెక్కించేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు త్రివిక్ర‌మ్. మ‌రి ఈ ప్రాజెక్టులోనూ త్రివిక్ర‌మ్ కి వాటా ద‌క్కుతుందా? లేదంటే వీటికి ప‌వ‌న్ సోలో నిర్మాతా? అనేది మాత్రం తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close