జ‌బ‌ర్‌ద‌స్త్ బాంబ్ పేల‌నుందా?

బుల్లి తెర‌పై తిరుగులేని హిట్ గా నిలిచింది జ‌బ‌ర్‌ద‌స్త్‌. అటు మ‌ల్లెమాల‌కూ, ఇటు ఈటీవీకి కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ షోతో పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లు ఎంతో మంది. వాళ్లు వెండి తెర‌పై కూడా ఇప్పుడు విజృంభిస్తున్నారు. అయితే జ‌బ‌ర్‌ద‌స్త్ బాంబు త్వ‌ర‌లోనే పేలిపోబోతోంద‌న్న‌ది బుల్లితెర వ‌ర్గాల మాట‌. ఈ షో రేంటింగులు నానాటికీ త‌గ్గిపోతున్నాయి. ఒక‌ప్పుడు యావ‌రేజ్ గా రేటింగులు 12, 13 వ‌చ్చేవి. ఇప్పుడు 4 దాటితే గ‌గ‌నం అయిపోతున్నాయి. స్కిట్స్ న‌వ్వించ‌క‌పోవ‌డం, యూ ట్యూబ్‌లో విరివిగా ఆ స్కిట్లు అందుబాటులోకి వ‌చ్చేయ‌డంతో టీవీలో చూసేవాళ్ల సంఖ్య త‌గ్గిపోయింది. దానికి తోడు జ‌బ‌ర్‌ద‌స్త్ లాంటి కార్య‌క్ర‌మాలు దాదాపుగా మిగిలిన ఛాన‌ళ్లూ క్యారీ చేస్తున్నాయి. శ్రీ‌దేవి డ్రామా కంపెనీ పేరుతో ఈటీవీలోనే ఓ షో వ‌స్తోంది. అందులోనూ జ‌బ‌ర్ ద‌స్త్ న‌టీన‌టులే క‌నిపిస్తున్నారు. రెండు షోల‌కూ పెద్ద తేడా కూడా ఉండ‌డం లేదు.

మ‌రోవైపు జ‌బ‌ర్‌ద‌స్త్ ఆర్టిస్టుల ఎగ్రిమెంట్ కాలం దాదాపుగా పూర్తి కావొచ్చింది. వాళ్లు మ‌ళ్లీ కొత్త‌గా ఎగ్రిమెంట్లు చేసుకోవ‌డానికి రెడీగా లేరు. దాదాపు స‌గం మంది… ఈ షో నుంచి వైదొలిగే ఛాన్స్ వుంది. అన్నిటికంటే ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అనే సంస్క్కృతి ఈ షోకీ దాపురించింద‌ని తెలుస్తోంది. లేడీ ఆర్టిస్టుల్ని కొంత‌మంది బాగా ఇబ్బంది పెడుతున్నార‌ని, ఒక‌రిద్ద‌రు జ‌బ‌ర్‌ద‌స్త్ స్టార్ల వ‌ల్ల‌… లేడీ ఆర్టిస్టులు బాగా డిస్ట్ర‌బ్ అయ్యార‌ని, వీళ్ల వ్య‌వ‌హారం… మ‌ల్లెమాల ద‌గ్గ‌ర‌కు కూడా తీసుకెళ్లార‌ని తెలుస్తోంది. ఈ బాంబు పేలే రోజు.. ఎంతో దూరంలో లేద‌ని, త్వ‌ర‌లోనే ఒక‌రిద్ద‌రు మీడియా ముందుకొచ్చి, త‌మ గోడు వెళ్ల‌గొక్కుకునే ఛాన్సుంద‌ని చెప్పుకుంటున్నారు. అదే జ‌రిగితే జ‌బ‌ర్‌ద‌స్త్ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురివిందలు : కడపకు వైఎస్ పేరు పెట్టినప్పుడు జగన్, విజయమ్మ స్పందించారా!?

కృష్ణా జిల్లాను రెండు మక్కలు చేసి ఒక దానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెడుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. చట్టపరమైన అడ్డంకులు అన్నింటినీ అధిగమించి జిల్లా...

విడాకుల‌పై నేనేం మాట్లాడ‌లేదు: నాగార్జున‌

నాగ‌చైత‌న్య - సమంత విడాకుల‌పై నాగార్జున స్పందించార‌ని, స‌మంత కోరిక మేర‌కే నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చాడ‌ని, ఇందులో చై చేసిందేం లేద‌న్న‌ట్టు... ఈరోజు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో... ఈ విడాకులకు...

హిందూపురం జిల్లా కోసం బాలకృష్ణ పోరాటం తప్పదు !

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో సమర్థిస్తున్నారు. అయితే ఆయన డిమాండ్ ఒక్కటే హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం. కానీ ప్రభుత్వం మాట...

తెలంగాణ ఐఏఎస్ కూతురి పెళ్లికి “మేఘా” ఖర్చులు !?

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇరిగేషన్ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్‌పై తీవ్రమైన ఆవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రజత్ కుమార్ కుమార్తె పెళ్లి అత్యంత జరిగింది. హైదరాబాద్‌లోని పలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close