యువ హీరోకి రూ.3 కోట్ల టోక‌రా

టాలీవుడ్‌లో శిల్పా చౌద‌రి ప్ర‌కంప‌న‌లు సృష్టించేసింది. చాలా మంది సెల‌బ్రెటీల‌కు కోట్ల‌కు కోట్లు టోక‌రా వేసింది. వాళ్ల పేర్లు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. శిల్పా చౌద‌రి వ‌ల్ల మోస‌పోయిన వాళ్ల జాబితాలో మ‌రో హీరో కూడా చేరాడు. త‌నే.. హ‌ర్ష్ కానుమ‌ల్లి. ఈ సినిమాకి శిల్పా చౌద‌రి నిర్మాత‌. అయితే త‌ను ఒక్క పైసా కూడా పెట్ట‌లేదు. వెనుక నుంచి ఓ పేరున్న రాజ‌కీయ నాయ‌కుడు పెట్టుబ‌డి పెడితే.. శిల్పా బినామీగా వ్య‌వ‌హ‌రించింది. ఈ సినిమాతో హ‌ర్ష్ తో స్నేహం చేసుకుంది. స్థ‌లాల పేరు చెప్పి కొంత‌, అప్పుగా కొంత ఇలా… రూ.3 కోట్ల వ‌ర‌కూ ముంచేసింది. ఇప్పుడు ఆ మూడు కోట్లూ గ‌ట్లంతైన‌ట్టే. శిల్పా చేతిలో మోస‌పోయిన వారిలో ఓ టాలీవుడ్ అగ్ర హీరో కూడా ఉన్నాడ‌ని టాక్‌. ఆయ‌న, శిల్పా క‌లిసి ఉన్న కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఒక్క‌రూ మీడియా ముందుకు రాలేదు. తెర వెనుక నుంచే త‌మ డ‌బ్బుల్ని వెన‌క్కి రాబ‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురివిందలు : కడపకు వైఎస్ పేరు పెట్టినప్పుడు జగన్, విజయమ్మ స్పందించారా!?

కృష్ణా జిల్లాను రెండు మక్కలు చేసి ఒక దానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెడుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. చట్టపరమైన అడ్డంకులు అన్నింటినీ అధిగమించి జిల్లా...

విడాకుల‌పై నేనేం మాట్లాడ‌లేదు: నాగార్జున‌

నాగ‌చైత‌న్య - సమంత విడాకుల‌పై నాగార్జున స్పందించార‌ని, స‌మంత కోరిక మేర‌కే నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చాడ‌ని, ఇందులో చై చేసిందేం లేద‌న్న‌ట్టు... ఈరోజు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో... ఈ విడాకులకు...

హిందూపురం జిల్లా కోసం బాలకృష్ణ పోరాటం తప్పదు !

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో సమర్థిస్తున్నారు. అయితే ఆయన డిమాండ్ ఒక్కటే హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం. కానీ ప్రభుత్వం మాట...

తెలంగాణ ఐఏఎస్ కూతురి పెళ్లికి “మేఘా” ఖర్చులు !?

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇరిగేషన్ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్‌పై తీవ్రమైన ఆవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రజత్ కుమార్ కుమార్తె పెళ్లి అత్యంత జరిగింది. హైదరాబాద్‌లోని పలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close