చిరంజీవికి కొత్త త‌ల‌నొప్పి

సాధ్య‌మైనంత వ‌ర‌కూ వివాదాల‌కు దూరంగా ఉంటాల‌నుకుంటారు చిరంజీవి. అజాత శ‌త్రువు అని, అంద‌రివాడ‌ని పిలిపించుకోవాల‌ని త‌ప‌న‌. అయితే అప్పుడ‌ప్పుడూ చిరుకి ఝ‌ల‌క్కులు త‌గులుతూనే ఉంటాయి. అనుకోని వివాదాలు ప‌ల‌క‌రిస్తూనే ఉంటాయి. ప్ర‌స్తుతం బాల‌య్య కామెంట్లు, ఆ త‌ర‌వాత నాగ‌బాబు స్పంద‌న‌లూ.. చిరంజీవికి కొత్త త‌ల‌నొప్పుల్ని తీసుకొచ్చాయి.

దాస‌రి లేక‌పోవ‌డంతో చిత్ర‌సీమ‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆ స్థానంలో చిరు రావాల‌ని చాలామంది కోరిక‌. అది నెర‌వేరింది కూడా. ఈమ‌ధ్య సీసీసీ ఏర్పాటు చేసే విష‌యంలోనూ, చిత్ర‌సీమ స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డంలోనూ చిరు `గ్యాంగ్‌ లీడ‌ర్‌` బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించారు. ఆయ‌న యాక్టీవ్‌గా ముందుకు రావ‌డంతో ప‌రిశ్ర‌మ‌కూ.. ఓ పెద్ద తోడు దొరికిన‌ట్టైంది. లాక్ డౌన్ వ‌ల్ల చిత్ర‌సీమ స్థంభించిపోంది. తిరిగి కార్య‌క‌లాపాలు సాగించుకోవ‌డానికి అనుమ‌తుల కోసం ప్ర‌భుత్వంతో విరివిగా సంప్ర‌దింపులు జ‌రుగుతోంది చిత్ర‌సీమ‌. ఆ బృందంలో అగ్ర క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ లేక‌పోవ‌డం చాలామందిని విస్మ‌య ప‌రిచింది. చివ‌ర‌కు బాల‌య్య కూడా న‌న్నెవ్వ‌రూ పిల‌వ‌లేదు… అని చెప్ప‌డం మ‌రింత షాకింగ్‌గా అనిపించింది.

బాల‌య్య ఎలాంటి వ్యాఖ్య‌లు చేశారన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే – అస‌లు బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పు. బాలయ్య వ‌స్తాడా, రాడా? అనే సందేహాలు ప‌క్క‌న పెట్టి, క‌నీసం క‌ర్టెసీకి అయినా – పిల‌వాల్సింది. దాంతో.. మొద‌టి త‌ప్పు చిరు క్యాంప్‌ది అయ్యింది. దానికి తోడు నాగ‌బాబు వీరావేశంతో రెచ్చిపోవ‌డం నిజంగా చిరుని ఇబ్బంది పెట్టేదే. ఎందుకంటే ఎంత‌కాద‌న్నా నాగ‌బాబు మెగా బ్ర‌ద‌ర్‌. త‌న అన్న‌ని వెన‌కేసుకురావ‌డానికి నాగ‌బాబు చేసిన ప్ర‌య‌త్నం అద‌న్న సంగ‌తి అంద‌రికీ అర్థ‌మ‌వుతూనే ఉంది. ఇప్పుడు చిరు చెప్పాల్సిన జ‌వాబులు రెండున్నాయి. ఒక‌టి.. బాల‌య్య‌ని ఎందుకు పిల‌వ‌లేదూ.. అన్న‌ది. రెండోది `భూములు పంచుకున్నారు` అనే ఆరోప‌ణ‌కి వివ‌ర‌ణ‌. అయితే… ఇలాంటి విష‌యాలు ఎంత కెలుక్కుంటే అంత త‌ల‌నొప్పి. మ‌రి ఈ స‌మ‌స్య నుంచి చిరు ఎలా దాటుకొస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close