సొల్లు అన్నది కత్తి, ఆర్ జి వీలనట

విజయవాడ నుంచి నవ్యాంధ్ర తొలి శాటిలైట్‌ టీవీ ట్యాగ్‌తో ప్రసారమవుతున్న ఎపి24/7 ఛానల్‌ స్థానికంగా ఈవెంట్లు నిర్వహిస్తున్నది. కొంత కదలికతో పాటు అక్కడి వారిలో ఉత్సాహం కూడా వచ్చింది. అంతవరకూ బాగానే వుంది గాని అక్కడకు వెళ్లని వారిది తప్పన్నట్టు చిత్రించేందుకు కొంతమంది రాజకీయ వాదులు ముఖ్యంగా టీడీపీ అనుయాయులు ప్రయత్నించడం బాలేదు. రిపబ్లిక్‌ డే నాడు చేసిన జెండా పండుగలో జర్నలిస్టు సాయి తొలి పలుకులు చెబుతూ అక్కడ కూచుని సొల్లు చర్చలు చేయడం కాదు, ఇక్కడకు వచ్చి సొల్యూషన్స్‌ చూపించాలని ఓ సవాలు విసిరారు. ఈ ఎపి వర్సెస్‌ టిఎస్‌ విజయవాడ వర్సెస్‌ తెలంగాణ ధీమ్‌నే పట్టుకున్న ఒక టిడిపి నాయకుడు వెంటనే అదిగో సాయి గర్జిస్తున్నాడంటూ పోస్టు పెట్టారు. యూ ట్యూబ్‌లో కూడా సొల్లు చర్చలు కాదు అని శీర్షిక నిచ్చారు. తమను తాము ఎంతైనా పొగుడుకోవచ్చు ముందుగా వెళ్లడాన్ని హర్షించవచ్చు గాని మిగతా వారిపై వ్యాఖ్యలు ఎందుకని అడిగితే నిర్వాహకులు ఇచ్చిన సమాధానం మరోలా వుంది. తాము కత్తి మహేష్‌, రామ్‌ గోపాల్‌ వర్మ ల చెత్తచర్చల గురించి అన్నామే గాని ఇతర అంశాలు కాదని వారు వెంటనే వివరణిచ్చారు. సొల్లు అన్నందుకు వెంటనే సర్దుకునే ప్రయత్నం కూడా చేశామని చెబుతున్నారు. టిడిపి ఆ మాటలకు ఇచ్చిన ట్విస్టు కూడా వారికి రుచించడం లేదు.

ఇంతకూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన చాలా కాలానికి గాని పత్రికలు మద్రాసు నుంచి విజయవాడ రాలేదు. అప్పుడూ ఇప్పుడూ కూడా ముందుగా వెళ్లింది ప్రజాశక్తి మాత్రమే! హైదరాబాదుకూ ఆలస్యంగాే ఈనాడు గాక ఇతర పత్రికలు తరలివచ్చాయి. సినిమా పరిశ్రమ 90లలోనే తరలింది. కనుక ప్రతిదానికి సాధకబాదకాలుంటాయి.పైగా రెండూ తెలుగు రాష్ట్రాలే గనక హైదరాబాదులో అందరికీ వ్యాపారులున్నాయి గనక పెద్ద హడావుడి కూడా పడటం లేదు. కొత్తవారుఅక్కడే పెట్టడం వేరు. వారు నిలదొక్కుకోవాలని కోరుకోవాలి, కాని మీడియా వ్యాపారంలో ప్రత్యక్ష లాభాలు తక్కువ గనక కోటానుకోట్లు పెట్టి పరుగెత్తాలనుకోవడం సులభ సాధ్యం కాదు. సమయం పడుతుంది,సహనం కోరుతుంది. సినీ అవార్డుల సందర్భంలో ఆధార్‌ కార్డు గురించి యువరాజు లోకేశ్‌ మాట్లాడితే ఎంత వివాదమైందో ఎవరూ మర్చిపోకూడదు. ఇంతా చేసి లోకేశ్‌ భార్యాపిల్లలు భారీ నివాస భవనం హైదరాబాదులోనే వున్న మాట నిజం కదా! సొల్యూషన్‌ దొరికే వరకూ సొల్లు మాట్లాడకపోవడమే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: మూడు ముక్క‌లాట‌

ద‌స‌రా సంద‌ర్భంగా టాలీవుడ్ కొత్త సినిమాలతో క‌ళ‌క‌ళ‌లాడింది. మ‌హాస‌ముద్రం ఫ్లాప్ అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఓకే అనిపించుకుంది. పెళ్లి సంద‌డి బోర్ కొట్టించినా, కొన్ని ఏరియాల్లో అనూహ్య‌మైన వ‌సూళ్ల‌ని రాబ‌ట్టుకుంది. ఈ...

నెటిజన్స్ డిమాండ్: ఇతరుల తల్లులను తిట్టిన నేతలపై కూడా జగన్ చర్యలు తీసుకోవాలి

తాజాగా పట్టాభి వ్యాఖ్యల కారణం గా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న జగడం ప్రజల కి వి‌స్మయం కలిగిస్తోంది. పోలీసుల సంస్మరణ దినం సందర్భం గా ముఖ్య మంత్రి జగన్ కూడా ఇదే...

ద‌ర్శ‌కుల‌కూ బాకీ ప‌డ్డాడా?

ఇటీవ‌ల యువ నిర్మాత మ‌హేష్ కోనేరు గుండె పోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ మృతితో.. టాలీవుడ్ షాక్ కి గురైంది. ఓర‌కంగా... చాలామంది గుండెలు కూడా ఉలిక్కిప‌డిన‌ట్టైంది. సాధార‌ణంగా...

మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని పదుల సంఖ్యలో ఫిర్యాదులు !

మంచు మోహన్ బాబుపై పలికిన ఓ డైలాగ్ వివాదాస్పదమయింది. ఆయనపై రెండు తెలుగు రాష్ట్రాల సంఖ్యలో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మొదట అనంతపురం జిల్లాలో ఓ యాదవ సంఘం నేత పోలీసులకు...

HOT NEWS

[X] Close
[X] Close