ఏపీ బీజేపీ నిర్ణయాలు ఇక కోర్ కమిటీ చేతుల్లో !

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పలుకుబడి పడిపోయింది. పదవి అందిన మొదట్లో సస్పెషన్లు.., టీవీచానళ్ల బహిష్కరణల నిర్ణయాన్ని అలవోకగా చేసిన ఆయనకు ఇప్పుడు పదవి మిగిలింది కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేసారు. కొత్తగా కోర్ కమిటీని బీజేపీ హైకమాండ్ నియమించింది. అందులో అటు వైసీపీ సానుభూతిపరులతో పాటు ఇటు టీడీపీ సానుభూతిపరులుగా పేరు తెచ్చుకున్న వారికీ ప్రాధాన్యం దక్కింది. ఎటొచ్చి.. నిఖార్సుగా బీజేపీకి పని చేస్తారని పేరు పడిన వారే పెద్దగా లేరు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా ప్రకటించిన కోర్ కమిటీలో పురందేశ్వరి, సత్యకుమార్‌, కన్నా లక్ష్మీనారాయణ , సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, మధుకర్‌, ఎమ్మెల్సీ మాధవ్‌ వంటి వారు ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఓ కోర్ కమిటీ ఉంది. కానీ దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నిర్ణయాలను సోము వీర్రాజు తనకు నచ్చిన వారితో సమావేశమై తీసుకునేవారు. టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలను అసలు పిలిచేవారు కాదు. పట్టించుకునేవారు కాదు. దీంతో జేపీ నడ్డా .. కోర్ కమిటీని నియమించి.. అందులోనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.

టీడీపీ నుంచి నేతలను టీడీపీ సానుభూతి పరులని.. ఓ సామాజికవర్గం వారని చెప్పి దూరంగా ఉంచుతూ వచ్చారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వారంతా వైసీపీ సానుభూతిపరులుగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్న వైసీపీని వదిలేసి టీడీపీని విమర్శిస్తూ ఉంటారు. ఈ పరిణామాలపై అమిత్ షాకూ స్పష్టమైన సమాచారం ఉండటంతో అందరూ కలిపి నిర్ణయాలు తీసుకునేలా చేశారు. ఆయన ఆదేశించారు.. జేపీ నడ్డా పాటించారు. ఎలా చూసినా ఇప్పటి వరకూ వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించిన ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఇక ముందు కాస్తంత మార్పు వచ్చే అవకాశం మాత్రం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ ఫ్యాన్‌పై రాజద్రోహం, యుద్ధం కేసులు … బెయిలిచ్చిన కోర్టు!

ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వామిభక్తిలో ఎవరూ అందుకోనంత స్థాయికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని జనసేన సానుభూతి పరుడైన ఓ యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పెట్టిన సెక్షన్లు చూసి న్యాయమూర్తే...

తెరపైకి మళ్లీ దళిత బంధు !

హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన రెండున్నర నెలల తర్వాత దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ మరో ప్రకటన చేశారు. నిజానికి గత డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు దిక్కులా ఉన్నా నాలుగు మండలాల్లో...

“బండి”కి న్యాయం.. నాకు అన్యాయమా ?: రఘురామా

బండి సంజయ్‌పై పోలీసుల దాడిని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు కారణమైన వారందర్నీ పిలిపించి ప్రశ్నించబోతోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్...

గుడివాడ కేసినో ఆధారాలు రిలీజ్ చేసిన టీడీపీ !

గుడివాడలో కేసినో నిర్వహించామని నిర్వహిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. అయితే కేసినో నిర్వహించారన్నదానికి అన్ని ఆధారాలూ సమర్పిస్తామని టీడీపీ చెబుతోంది. ముందుగా కేసినో నిర్వాహకులు.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close