ఎఫ్ 3 సెట్లో క‌రోనా అల‌జ‌డి

క‌రోనా రెచ్చిపోతోంది. ముఖ్యంగా… చిత్ర‌సీమ‌ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. మ‌హేష్‌బాబు, త‌మ‌న్‌, విశ్వ‌క్ సేన్‌, మంచు మ‌నోజ్‌, ల‌క్ష్మి, రాజేంద్ర‌ప్ర‌సాద్, త్రిష‌, మీనా, స‌త్య‌రాజ్‌, బండ్ల గ‌ణేష్‌.. ఇలా ఒక‌రా, ఇద్ద‌రా ఎవ‌రిని క‌దిలించినా క‌రోనానే. ఇప్ప‌డు ఎఫ్ 3 టీమ్ ని క‌రోనా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఈ టీమ్ లో ఒక్క‌సారిగా 20 మంది క‌రోనా బారీన ప‌డ్డార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. దాంతో… ఉన్న ఫళంగా షూటింగ్ ఆపేశారు. గ‌త రెండు రోజుల నుంచీ.. హైద‌రాబాద్ లో `ఎఫ్ 3` షూటింగ్ జ‌రుగుతోంది. ఎందుకైనా మంచిద‌ని టీమ్ స‌భ్యులంద‌రికీ ఒకేసారి క‌రోనా టెస్టులు చేయించింది చిత్ర‌బృందం. దాంతో 20 మందికి క‌రోనా అని బ‌య‌ట‌ప‌డింది. వెంట‌నే షూటింగ్ కి పేక‌ప్ చెప్పేశారు. క‌రోనా భ‌యంతోనే వెంక‌టేష్ ముందే షూటింగ్ కి డుమ్మాకొట్టార్ట‌. ఆయ‌న లేని స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు ఈ క‌రోనా బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు మిగిలిన షూటింగుల్లోనూ సిబ్బందికి క‌రోనా టెస్టులు మొద‌లెట్టార‌ని, ఆ రిపోర్టుల్ని బ‌ట్టి షూటింగులు కొన‌సాగించాలా, వ‌ద్దా అనే నిర్ణ‌యానికి రానున్నార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close