టీకా వచ్చే సరికి అవసరం లేనోళ్లు ఎక్కువగా ఉంటారట..!

కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచం మొత్తం చర్చ జరుగుతోంది. ఫైజర్ కంపెనీ తమ టీకా 90 శాతం ఫలితాలిస్తోందని ప్రకటించగానే… ప్రపంచం మొత్తం హెడ్ లైన్స్ అయింది. తర్వాత రష్యా.. తమ స్కోర్ 92 శాతం సమర్థత అని చెప్పుకుంది. ఇంకా చాలా  ఫార్మా కంపెనీలు తమ టీకాను… తుది దశ పరీక్షలకు పంపాయి. ఆ రిజల్ట్స్ రావాల్సి ఉంది . మరో వైపు దేశాలకు దేశాలు.. టీకా పంపిణీకి ఏర్పాట్లు చేసుకుటున్నాయి. భారత్ లాంటి దేశాల్లో కోట్లకు కోట్ల డోసులు రెడీగా ఉన్నాయని ప్రాధాన్యతలు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సమాచారం కూడా పంపారు. అయితే..  టీకా పూర్తి అందుబాటులోకి వచ్చే సరికి.. దాని అవసరం లేని వాళ్లే ఎక్కువగా ఉంటారని తాజాగా నిపుణులు చెబుతున్నారు.

సీరో సర్వైలెన్స్ సర్వే ద్వారా.. అసలు కరోనా ఎంత మందికి సోకిందన్న విషయంపై పరిశోధన చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే సగం మందికిపైగా కరోనా సోకి… తగ్గిపోయిందని… వారిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ప్రకటించారు. అది ఇంకా పెరుగుతోంది. కొన్నాళ్ల తర్వాత అది 70, 80 శాతం మందికి చేరుతుంది. కొంత మందికి కరోనా సోకకుండానే యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతున్నాయని గుర్తించారు. అంటే.. ఓ రకంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లే.   వైరస్ సోకినప్పుడు మనిషి దాన్ని తట్టుకోగలిగితే… ఆటోమేటిక్‌గా అతనిలో దాన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం వైరస్ ఆరేళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారికి సోకినా ప్రభావం తక్కువే ఉంటోంది. అరేళ్లలోపు.. అరవయ్యేళ్ల పైబడిన వారిని మాత్రం జాగ్రత్తగా ఉంచి మగిలిన వారందర్నీ.. అలా వదిలేయడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ దశ వచ్చేస్తుందని పలు దేశాలు నమ్ముతున్నాయి.

హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే… జనాభాలో 60 శాతం మందికి వైరస్ వచ్చి ఉండాలి.   మన జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి. అప్పుడు ఆ జనాభా అంతటికీ ఇమ్యూనిటీ వచ్చిందని అనుకోవచ్చు. అంటే..  హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించినట్లే. ఇలా ఒక ప్రాంతంలోని సమూహానికి ఇమ్యూనిటీ వచ్చినప్పుడు.. మళ్లీ వైరస్‌ దాడి చేసినా నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఈ హెర్డ్ ఇమ్యూనిటీ దగ్గరకు ఇండియా వచ్చిందని.. తర్వాత టీకా వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా అటు జనాల్ని.. ఇటు ప్రజల్ని ఓ ఆట ఆడేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close