మీడియా వాచ్ : కేసీఆర్ ప్రాపకం కోసం ఎన్టీవీ ఆత్రం..!

తెలుగులో ప్రముఖ చానళ్లుగా ఉన్న వాటిలో ఎన్టీవీది భిన్నమైన శైలి. ఇష్టమైన నేతలకు ప్రచారం చేయడంతో పాటు..  ఆ ఇష్టమైన నేతలకు ఇష్టం లేని వారిపై దుమ్మెత్తి పోయడంలోనూ.. తనదైన మార్క్ చూపిస్తూ ఉంటుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్‌ఈసీపై అవాకులు.. చెవాకులు పేలుతూ..మీడియా స్వేచ్చ పేరుతో అరగంట కథనాలు రాయడమే కాదు.. ఇప్పుడు.. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత కేసీఆర్‌కు కష్టం వచ్చిందని.. రంగంలోకి దిగారు. ఆయన ఉద్యమ చరిత్రను చెబుతూ.. ఆయన నిబద్దతను గుర్తు చేస్తూ.. దీపావళిసంబరాలను పక్కన పెట్టి మరీ.. ఓ అరగంట కథనం వండి వార్చారు. ఒక్క ఓటమితో ఆయన ప్రభ మసకబారదని.. అంతిమంగా ఆ అరంగటంలో చెప్పుకొచ్చారు.

కేసీఆర్ ప్రాపకం కోసం పొగిడేందుకు ఎన్టీవీ ఈ కథనం రాసినట్లుగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే.. దుబ్బాక ఓటమితో కేసీఆర్ రాజకీయ ప్రభ తగ్గిపోయిందని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. ఆయన ప్రజల్ని పట్టించుకోకపోవడం వల్ల.. ఓ షాక్ ఇచ్చారని ..  ఇది మామూలేనని అందరూ అనుకుంటున్నారు. కానీ.. ఎన్టీవీ మాత్రం..  ఏదో భారీ షాక్ తగిలిందని.. ఆయనను తక్కువ చూడవద్దని.. చెబుతున్నట్లుగా కథనం వండి వార్చారు. కేసీఆర్ ప్రసుత తరం నేతనే. ఆయన ఉద్యమాల గురించి.. పట్టుదల గురించి.. రాజకీయ వ్యూహాల గురించి.. తెలియని జనం ఎవరు ఉంటారు..? ఇప్పుడు ఆ విషయాలు చూపి పొగడాల్సిన అవసరం ఏముంది..?

కేసీఆర్ విషయంలో ఎన్టీవీ ప్రసారం చేసిన అరగంట బాకాను పూర్తిగా చూసిన వారికి.. మెచ్చాను… ఏం వరం కావాలో కోరుకో.. అని ప్రభువు కోరతాడేమో అని పొడిగినట్లుగా ఉందని సులువుగానే అర్థమవుతుంది. వ్యాపార ప్రయోజనాల కోసం.. ఇలా మీడియా చానళ్ల అధిపతులు.. ప్రత్యేకంగా కథనాలు రాయించుకోవడం సహజమే. కానీ అవి అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. టైమింగ్ మిస్సయితే తేడా కొడతాయి. ఎన్టీవీ యజమానికి ఇప్పుడు.. ఈ కథనం.. ఏదైనా ప్రతిఫలం ఇస్తుందో.. రియాక్షన్ ఇస్తుందో… ఏ ఉద్దేశంతో రాయించారో.. దాని కోసం ప్రయత్నించినప్పుడే తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close