మీడియా వాచ్ : సాక్షి ఆఫీసులో కరోనా కలకలం..!

తెలుగు మీడియాలోనూ కరోనా కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయం కేంద్రంగా విధులు నిర్వహించే ఓ రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. సాక్షి కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. బుధవారం మొత్తం సాక్షి కార్యాలయంలో అదే హడావుడి నడిచింది. ప్రత్యేకంగా డి ఇన్‌ఫెక్షన్ యంత్రాన్ని తీసుకొచ్చి.. ఉద్యోగులందర్నీ దాని ద్వారా నాలుగైదు సార్లు నడిపించారు. అలాగే.. లిఫ్టుల వాడకాన్ని నిలిపివేశారు. ఆఫీసు మొత్తాన్ని శానిటైజ్ చేశారు. ఆ ఉద్యోగి.. సాక్షి దినపత్రిక రిపోర్టర్.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో ఉండే సాక్షి ఆఫీసులో పై అంతస్తుల్లో సాక్షి టీవీ .. కింది అంతస్తుల్లో దినపత్రిక కార్యకాలపాలు నడుస్తూ ఉంటాయి. ఐదో అంతస్తులో కీలకమైన రిపోర్టింగ్ .. డెస్క్ వ్యవహారాలు ఉంటాయి. అక్కడే విధులు నిర్వహించే ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో..ఆ ఫ్లోర్‌లో ఉండే ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా అస్వస్థతగా ఉండటం.. కరోనా లక్షణాలు బయటపడటతో.. టెస్టులు నిర్వహించడంతో.. కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా కరోనా సోకితే.. ఆ ఏరియాను.. కంటెన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి.. సీజ్ చేస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కనీసం ఏడు రోజుల పాటు.. అక్కడ ఎవరినీ అనుమతించకూడదు. అయితే.. సాక్షి కార్యాలయాన్ని మాత్రం.. శానిటైజ్ చేసి.. యధావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఈనాడు యూనిట్ ఆఫీసు ఉన్న గ్రామంలో కరోనా కేసు బయటపడిందని కొన్నాళ్ల కిందట.. ఆ యూనిట్ ఆఫీసును తెరవడానికి అక్కడి ప్రభుత్వ వర్గాలు అంగీకరించలేదు. దాంతో.. తిరుపతి యూనిట్ నుంచి.. ప్రింటింగ్ చేసి.. కడపకు పంపించాల్సి వచ్చింది. ఇప్పుడు.. హైదరాబాద్ సాక్షి ఆఫీసులో కరోనా కేసు బయటపడినా… కంటెన్మెంట్ జోన్ దాకా వెళ్లకుండా… శానిటేషన్‌తోనే సరి పెట్టారు. ఇటీవల కేంద్రం రూల్స్ మార్చడం కూడా దీనికి ఓ కారణం కావొచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ డూప్ టూ‌ మూవీ మొఘ‌ల్‌!

1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో 'న‌మ్మిన బంటు' సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హ‌డావుడే...

HOT NEWS

[X] Close
[X] Close