మీడియా వాచ్ : రామోజీ ఆశ‌యానికి గండికొట్టిన క‌రోనా

కరోనా మీడియాపై, మ‌రీ ముఖ్యంగా ప్రింటు మీడియాపై పెను ప్ర‌భావాన్ని చూపించింది. దిన ప‌త్రిక‌ల స‌ర్క్యులేష‌న్ దారుణంగా ప‌డిపోయింది. ప్రింటింగు త‌గ్గించారు. పేజీలు త‌గ్గించారు. సిబ్బందిని తీసేశారు. వార ప‌త్రిక‌ల సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. అవి మ‌ళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయో తెలీదు. రామోజీ రావు ఎంతో ఇష్టంగా ప్రారంభించిన `తెలుగు వెలుగు`, `బాల‌భార‌తం`ల‌పై కూడా ఈ ప్ర‌భావం ప‌డింది. రామోజీ రావు క‌ల‌ల పుత్రిక‌లు.. ఈ ప‌త్రిక‌లు. వీటి నిర్వ‌హ‌ణ‌ని స్వ‌యంగా చూసుకునేవారు. తెలుగు వెలుగుతో.. తెలుగు భాష ఖ్యాతిని ఈత‌రానికి అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌య‌త్నం. 20 రూపాయ‌ల ధ‌ర ఉండే ఈ ప‌త్రిక ప్ర‌తినెలా ఒక‌టో తారీఖున పాఠ‌కుల ముందుండేది. నాణ్య‌త విష‌యంలో రామోజీ రాజీ ప‌డేవారు కాదు. న‌ష్టం అని తెలిసినా.. మంచి క్వాలిటీతో ప‌త్రిక‌ను తీసుకొచ్చేవారు. తొలినాళ్ల‌లో ల‌క్ష స‌ర్క్యులేష‌న్ ఉండేది. క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గిపోతూ వ‌చ్చింది. అయినా స‌రే.. రామోజీ త‌గ్గ‌లేదు. ఎప్పుడూ లేనిది.. క‌థావిజ‌యం పేరుతో క‌థ‌ల పోటీలు పెట్టి, భారీ ఎత్తున పారితోషికాలు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు క‌రోనా వ‌ల్ల ఈ ప‌త్రిక ప్రింటింగ్ ఆగిపోయింది. కేవ‌లం ఆన్ లైన్ వెర్ష‌న్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఇక‌పైనా.. ప‌త్రిక ప్రింటు రూపంలో వ‌చ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. బాల‌భార‌తం ప‌రిస్థితీ ఇందే. విపుల‌, చ‌తుర కూడా ఎప్పుడో ఆన్ లైన్ వెర్ష‌న్‌కి షిఫ్ట్ అయిపోయారు. సితార కూడా అంతే. ఇప్పుడు తెలుగు వెలుగు, బాల భార‌తం వంతు వ‌చ్చింది. ఈనాడు స‌ర్క్యులేష‌న్ ఎప్పుడూ లేనంత ఘోరంగా ప‌డిపోయింది. ప‌ల్లెప‌ల్లెలోనూ ఈనాడు కనిపించేది. ఇప్పుడు కొన్ని గ్రామాల‌లో ఈనాడు జాడే లేదు. త‌క్కువ స‌ర్క్యులేష‌న్ ఉన్న ప్రాంతాల్ని గుర్తించి, అక్క‌డ‌కు ప‌త్రిక పంప‌డ‌మే మానేశారు. అలా.. ట్రాన్స్‌పోర్టు ఖ‌ర్చులు త‌గ్గించ‌డం కోసం. మొత్తానికి క‌రోనా వ‌ల్ల‌… ఈనాడు సంస్థ‌ల‌న్నీ తీవ్ర ప్ర‌భావానికి లోన‌య్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అన్‌లాక్ 5.0 : ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లకు గ్రీన్ సిగ్నల్..!

ఎట్టకేలకు..దాదాపుగా ఆరు నెలల గ్యాప్ తర్వాత సినిమా ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్‌ 5.0లో భాగంగా..అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ప్రారంభించుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు...

మద్యం అక్రమ రవాణాలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం రవాణాను రాజకీయ పార్టీల నేతలు సైడ్ బిజినెస్‌గా చేసుకున్నారు. గతంలో మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేసిన బీజేపీ నేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా ఈ సారి వైసీపీ నేత...

రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే చేతులు మిగలవు : సీపీఐ నారాయణ

కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి అగ్రెసివ్ మార్గాన్ని ఎంచుకుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నిర్ణయంపై దూకుడుగా వెళ్లి రైతాంగంలో మద్దతు పెంచుకుని ఓటు బ్యాంక్‌ను ప్రభావవంతంగా...

ప‌వ‌న్ సినిమా… మిర‌ప‌కాయ్ – 2?

హ‌రీష్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టిన సినిమా `మిర‌ప‌కాయ్`. నిజానికి ఈ సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీయాల‌నుకున్నాడు హ‌రీష్‌. కానీ కుద‌ర్లేదు. అది గుర్తుపెట్టుకునే హ‌రీష్ శంక‌ర్‌ని పిలిచి `గ‌బ్బ‌ర్ సింగ్‌`...

HOT NEWS

[X] Close
[X] Close