మండలి ప్రోరోగ్..! ఏ క్షణమైనా “మూడు” ఆర్డినెన్స్..!?

అసెంబ్లీ, శాసనమండలిలను ప్రోరోగ్ చేస్తూ..ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి మరో రెండు, మూడు వారాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయినప్పటికీ.. హడావుడిగా ప్రోరోగ్ చేశారు. .మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలకు సంబంధించి ఆర్డినెన్స్ లు జారీ చేయాలన్న వ్యూహంతోనే..ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీఆర్డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ఉన్నాయి. సెలక్ట్ కమిటీ ప్రక్రియ పీట ముడి పడింది. ఈ రెండు బిల్లులు మండలిలో ఉండటంతో ప్రభుత్వానికి ఏమీ చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే.. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి.. ఆర్డినెన్స్ జారీ చేస్తే.. అన్ని సమస్యలు పరిష్కారమైనట్లేనని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు..ప్రోరోగ్ చేశారు.

అయితే.. బిల్లులు అసలు ఏ సభలోనూ లేకపోతే… ఆర్డినెన్స్‌లు ఇవ్వొచ్చు కానీ సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లులపై ఆర్డినెన్స్‌లు ఇస్తే చెల్లవని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ముందుగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ జారీ చేస్తే గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి. ఆయన ముద్ర వేస్తే.. చాలా వరకూ ప్రభుత్వం అనుకున్న పని అయినట్లే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సానుకూల సంకేతాలు పొందారని.. అందుకే… అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్ చేశారని అంటున్నారు. నిజానికి బుధవారమే..కేబినెట్ భేటీలోనే .. అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్ చేసి… ఆర్డినెన్స్ తేవాలని అనుకున్నారు. కానీ మోడీ అపాయింట్ మెంట్ ఖరారయినందున.. నిర్ణయం వాయిదా వేశారు. ఈ రోజు.. నిర్ణయాన్ని తీసుకున్నారు.

అసెంబ్లీ, మండలి ప్రోరోగ్ అయినందున… వైసీపీ వ్యూహం ప్రకారం.. ఏ క్షణమైనా ఆర్డినెన్స్ జారీ చేస్ అవకాశం ఉంది. అయితే.. మంత్రులు పధ్నాలుగు రోజులు అయిపోయింది కాబట్టి.. బిల్లు పాస్ అయిపోయిందనే వాదన కూడా వినిపిస్తున్నారు. ఇప్పుడు… సర్కార్ బిల్లు పాస్ అయిపోయింది.. ఆమోదించాలని.. గవర్నర్ కు పంపుతుందా.. లేక… ఆర్డినెన్స్ జారీ చేస్తుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వ్యూహం ప్రకారం ఏదో ఓ నిర్ణయం తీసుకోవచ్చు..కానీ ఏ నిర్ణయం తీసుకున్నా… వివాదాస్పదమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close