చ‌ర‌ణ్ ఆ రీమేక్‌ని వ‌దిలేసిన‌ట్టే!

ధృవ హిట్ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్‌కి రీమేక్ సినిమాల‌పై మ‌మ‌కారం, న‌మ్మ‌కం పెరిగాయి. పక్క భాష‌లో ఏదైనా సినిమా హిట్ట‌యితే దానిపై ఫోక‌స్ పెడుతున్నాడు. ఈమ‌ధ్య త‌మిళ సినిమా ‘హీరో’ త‌న‌ని బాగా ఆక‌ట్టుకుంది. మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. శివ కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని చ‌ర‌ణ్ భావించాడు. త‌మిళ నిర్మాత‌ల‌తో మాట్లాడాడు కూడా. అయితే అప్ప‌టికే త‌మిళ నిర్మాత‌లు తెలుగు డ‌బ్బింగ్ రైట్స్‌ని మ‌రొక‌రికి అమ్మేశారు. చ‌ర‌ణ్ కోసం.. ఆ సినిమా డ‌బ్బింగ్ కాకుండా ఆపారు.

అయితే.. ఇంత‌లో ఏమైందో, ఈ సినిమా రీమేక్ చేయ‌కూడ‌ద‌ని చ‌ర‌ణ్ నిర్ణ‌యించుకున్నాడు. క‌థ బాగున్నా, త‌న శైలికి సెట్ అవ్వ‌ద‌ని చ‌ర‌ణ్ అనుకుంటున్నాడ‌ట‌. అందుకే… ‘హీరో’ క‌థ‌ని ప‌క్క‌న పెట్టేశాడ‌ని తెలుస్తోంది. దాంతో… నిర్మాత‌లు ఇప్పుడు ఈసినిమాని డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి ‘శ‌క్తి’ అనే పేరు పెట్టారు. వ‌చ్చే నెల‌లోనే ఈ డ‌బ్బింగ్ బొమ్మ విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close