మేర్ల‌పాక గాంధీతో నితిన్‌?

నితిన్ త్వ‌ర‌లోనే ‘భీష్మ‌’గా రానున్నాడు. ఈనెల 21న ఈ చిత్రం విడుదల అవుతోంది. `రంగ్ దే` కూడా సెట్స్‌పై ఉంది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి తో `చెక్‌` సినిమా స‌గం పూర్త‌యిపోయింది. ఈలోగా మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన అంధాధున్‌ని తెలుగులో రీమేక్ చేద్దామ‌నుకుంటున్నారు. ఠాగూర్ మ‌ధు, సుధాక‌ర్ రెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమాలో నితిన్ హీరోగా న‌టిస్తాడు. ద‌ర్శ‌కుడి ఎంపిక కూడా ఖాయ‌మైపోయింది. మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వహించనున్నాడని స‌మాచారం. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ద‌ర్శ‌కుడిగా ఆక‌ట్టుకున్నాడు మేర్ల‌పాక‌. ఆ త‌ర‌వాత ఎక్స్‌ప్రెస్ రాజా ర‌న్ కూడా మంచి విజ‌యాన్ని అందించింది. నానితో తీసిన కృష్ఱార్జున యుద్ధం మాత్రం తేడా కొట్టింది. అప్ప‌టి నుంచీ.. ఈ ద‌ర్శ‌కుడు క‌థ‌లు ప‌ట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. ఎట్ట‌కేల‌కు ఈ రీమేక్ ఓకే అయ్యింది. కాక‌పోతే నితిన్ డేట్లు దొర‌క‌డం క‌ష్టంగా మారింది. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ యేడాది చివ‌రి నాటిక‌ల్లా ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close