నోరుజారి బుక్క‌యిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ మాట‌లు ఎప్పుడూ స్ట్రైట్‌గానే ఉంటాయి. మేక‌ప్ వేసి మాట్లాడ‌డం త‌న‌కు అస్స‌లు న‌చ్చ‌దు. అలాంటి మాట‌లు విన‌డానికి బాగానే ఉంటాయి. కానీ ఒక్కోసారి ‘హ‌ద్దుమీరిన‌’ ఫీలింగ్ క‌లుగుతుంటుంది. ఇప్పుడూ అదే అయ్యింది. ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఓ వీడియో ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా `నేనో డాక్ట‌ర్‌తో డేట్ చేయాల‌నుకున్నా` అంటూ రాశీ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పింది. దాంతో.. ‘డాక్ట‌ర్లు అస్స‌లు టైమ్ ఇవ్వ‌రు’ అంటూ క‌ల‌గ‌చేసుకున్నాడు విజ‌య్‌. `నీ బుగ్గ‌లు బుగ్గ‌ల్లా క‌నిపించ‌వు.. మెడిక‌ల్ టెర్మ‌నాల‌జీలోనే చూస్తారు. నీ చెస్ట్ కూడా అంతే..` అంటూ ఏదేదో మాట్లాడేశాడు. రాశీఖ‌న్నా ఓ వైపు న‌వ్వుతున్నా – మ‌రోవైపు మాత్రం ‘చాలు చాలు..’ అంటూ ఆపేసింది. ‘అర్జున్ రెడ్డి చేయ‌డం వ‌ల్లే ఈ టెర్మ‌నాల‌జీలు నీకు తెలిశాయా’ అని కూడా అడిగింది.

ఈ కాన్వ‌ర్జేష‌న్ అంతా ఫ‌న్నీగానే అనిపించొచ్చు. కాక‌పోతే… డాక్ట‌ర్ల గురించి ఇలా మాట్లాడ‌డం క‌రెక్ట్ కాదు. డాక్ట‌ర్ల‌కు అస్స‌లు రొమాన్సే తెలీద‌ని విజ‌య్ ఉద్దేశ్య‌మా?? తానేదో స‌ర‌దాగా మాట్లాడాను అనుకోవొచ్చేమో గానీ, ఇలాంటివి సున్నిత‌మైన విష‌యాలు. విజ‌య్ లాంటి క్రేజ్ ఉన్న న‌టుడు, అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్న స్టార్‌.. మాట్లాడేట‌ప్పుడు కొన్ని హ‌ద్దులు పాటించాల్సిందే. పైగా ఓ అమ్మాయిని ప‌ట్టుకుని నీ బుగ్గ‌లు, చెస్ట్ అంటూ మాట్లాడ‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు. అందుకే… సోష‌ల్ మీడియాలో విజ‌య్ మాట్లాడిన ధోర‌ణిపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. నువ్వు ఇలా మాట్లాడాల్సింది కాదు.. అంటూ విజ‌య్ అభిమానులు సైతం మంద‌లిస్తున్నారు. విజ‌య్ ఈ దూకుడు ఎప్పుడు త‌గ్గించుకుంటాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com