లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ వెంకటేష్ నాయుడు ఫోన్ ను ఓపెన్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్క పెడుతున్న వీడియో వెలుగులోకి వచ్చినప్పుడు తమ అనుమతి లేకుండా ఫోన్ లో వీడియోలు లీక్ చేస్తున్నారని ఆయన భార్య కోర్టులో కేసు వేశారు. కానీ ఆ ఫోన్ ను తాము ఇంకా ఓపెన్ చేయలేదని సిట్ అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఓపెన్ చేయడానికి కోర్టు అనుమతి తీసుకున్నారు.
ముందుజాగ్రత్తగా వెంకటేష్ నాయుడు డాటా అంతా డిలీట్ చేసి ఉంటారు.కానీ రికవరీ చేయడానికి కావాల్సినంత సాంకేతికత సిట్ వద్ద ఉంటుంది. అందుకే డిలీట్ చేసినా.. మళ్లీ రిట్రీవ్ చేయగలరు. ఇప్పుడు ఆయన ఫోన్ నుంచి ఎన్ని కథలు బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. చెవిరెడ్డి మొత్తం క్యాష్ హ్యాండిలింగ్ ఆయన ద్వారానే చేశారు. వీడియో సాక్ష్యాలు పంపమని కోరినట్లుగా చెబుతున్నారు. ఆయన ద్వారానే మనీలాండరింగ్ చేశారు. వెంకటేష్ నాయుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టే ఆయనను తీసుకుని దేశం దాటిపోవాలనుకున్నారు.
వెంకటేష్ నాయుడు ఫోన్లో ఏ సమాచారం దొరికినా అది చెవిరెడ్డి మెడకే చుట్టుకుంటుంది. అందులో సందేహం ఉండదు. ఇప్పుడు చెవిరెడ్డి మరింతగా జైల్లో రచ్చ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. మిథున్ రెడ్డి కి, ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చిన తీరుపై సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి ఆదేశాల వరకూ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లు విచారించవద్దని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి హైకోర్టు సూచించింది.