యాంకర్ ప్రదీప్ విషయంలో కోర్టు తీర్పు ఇదే!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్‌ విషయంలో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రదీప్‌కు రూ.2100 జరిమానా విధించింది. డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని తిరిగొస్తున్న సమయంలో జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రదీప్ ఫూటుగా మద్యం సేవించి అడ్డంగా దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్‌లో 170కి పైగా పాయింట్లు నమోదు కావడంతో ప్రదీప్ కారును పోలీసులు సీజ్ చేశారు. ప్రదీప్ ఆ తర్వాత కొన్ని రోజులు అదృశ్యమయ్యాడు. ఎక్కడికెళ్లిపోయాడా అని చర్చ జరుగుతున్న తరుణంలో ఓ వీడియోను విడుదల చేసి కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశాడు. తండ్రితో కలిసి పోలీస్ కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరయ్యాడు. ఇవాళ కోర్టుకు కూడా తండ్రితో కలిసి వెళ్లాడు. మారిన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అతనికి జైలు శిక్ష పడుతుందనే వాదన వినిపించినా.. ప్రదీప్‌కు ఈ కేసు విషయంలో కొంత ఊరట లభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close