వ‌ర్మ‌కు కోర్టులో చుక్కెదురు

రామ్ గోపాల్ వర్మకు కోర్టు షాకిచ్చింది. వర్మ తాజా వివాద‌స్ప‌ద చిత్రం `మ‌ర్డ‌ర్‌` విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా వర్మ రూపొందించిన చిత్ర‌మిది. ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని భావించారు.

ఈ సినిమాపై ఇటు అమృత వ‌ర్గానికీ – వ‌ర్మ‌కి ముందు నుంచీ గొడ‌వ న‌డుస్తూనే ఉంది. ఈ సినిమాని, వ‌ర్మ‌ని ఉటంకిస్తూ.. అమృత సోష‌ల్ మీడియాలో ఓ లేఖ కూడా పోస్ట్ చేసింది. ఆ త‌ర‌వాత‌ ఈ సినిమా విడుద‌ల‌ను నిలిపివేయాల‌ని అమృత వ‌ర్గం కోర్టుకెక్కింది.

తమ కుటుంబాన్ని సంప్రదించకుండా వర్మ సినిమా తీస్తున్నారని, ఈ చిత్రంలో త‌మ కులాన్నీ, కుటుంబాన్నీ కించపరిచేలా స‌న్నివేశాలున్నాయ‌ని అమృత త‌ర‌పు న్యాయ‌వాది పిటీష‌న్ లో పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్త‌ర్వుల‌పై స్టే కోసం హై కోర్టుకు వెళ్తామ‌ని వ‌ర్మ త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే... బాల‌య్య సినిమా...

సాయిధ‌రమ్ టైటిల్‌… ‘విరూపాక్ష‌’?

రిప‌బ్లిక్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా.. సాయి కొన్నాళ్లు సినిమాల‌కు, షూటింగుల‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని.. మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్నాడు. వ‌రుస‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close