చిరు న‌క్స‌లైట్ గా మారిన వేళ‌…!

చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం `ఆచార్య‌`. చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ని ఈనెల 22న విడుద‌ల చేశారు. ధ‌ర్మ‌స్థ‌లి అనే ప్రాంతం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. న‌క్స‌లిజం అనే అంశం క‌థ‌లో భాగం. చిరు న‌క్స‌లైట్ గా క‌నిపిస్తాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం సాగుతూనే వుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ని డిజైన్ చేశాడు కొర‌టాల శివ‌.

ధ‌ర్మ‌స్థ‌లి అనే ప్రాంతాన్ని చూపిస్తూ, అక్క‌డ అణ‌గారిన ప్ర‌జ‌ల బాధ‌ల‌కు అద్దం ప‌ట్టేలా – వాతావ‌ర‌ణాన్ని సృష్టించి, అక్క‌డి ప‌రిస్థితుల‌కు ఎదురొడ్డి తిరుగుబాటు చేసే పాత్ర‌లో క‌థానాయ‌కుడి పాత్ర‌ని ప‌రిచ‌యం చేశారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేశారు. క‌థ‌లోని చాలా కీల‌క‌మైన స‌న్నివేశం అట అది. ఓ సామాన్యుడు… ప‌రిస్థితుల‌పై, పెట్టుబ‌డిదారుల‌పై తిరుగుబాటు చేస్తూ… ఎర్ర‌జెండా క‌ప్పుకుని, పోరాటం చేసే స‌న్నివేశ‌మే ఫ‌స్ట్ లుక్‌గా వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కూ న‌క్స‌లిజంపై ఎలాంటి మంచి అభిప్రాయం లేని క‌థానాయ‌కుడు, స‌డ‌న్ గా ఆ విధానాల‌పై ఆక‌ర్షిడుడై – అటువైపు అడుగులు వేసిన సంద‌ర్భంలో వ‌చ్చే తొలి ఫైట్ అని, క‌థ అక్క‌డి నుంచే మ‌లుపు తిరుగుతుంద‌ని తెలుస్తోంది. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ క‌థ‌లోకి కీల‌క‌మైన సంద‌ర్భంలో వ‌స్తుంద‌ని స‌మాచారం. అందుకే ఏరి కోరి ఈ లుక్‌ని దింపాడు కొర‌టాల శివ‌. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని పాట‌ల్ని కంపోజ్ చేశార‌ని తెలుస్తోంది. అందులో ఓ పాట‌ని ద‌స‌రాకి విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close