నేనే చెప్తా.. రూమ‌ర్లు న‌మ్మొద్దు: బాలు ఆరోగ్యంపై చ‌ర‌ణ్‌

క‌రోనా బారీ నుంచి ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోలుకున్నారని, తాజా ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు నెగిటీవ్ వ‌చ్చింద‌ని ఈరోజు ఉద‌య‌మే ఓ వార్త వినిపించింది. దాంతో బాలు ఆభిమానులు, సంగీతాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాలు కోలుకుంటున్నార‌ని, పూజ‌లు ఫ‌లిస్తున్నాయ‌ని భావించారు. కానీ.. అంత‌లోనే మ‌రో ట్విస్టు. “నాన్న‌గారి ఆరోగ్యం గురించి నేనే చెబుతా.. మీరు రూమ‌ర్లు న‌మ్మొద్దు“ అంటూ త‌న‌యుడు చ‌ర‌ణ్ ఓ వీడియో విడుద‌ల చేశారు.

“నాన్న‌గారి ఆరోగ్యం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు నేనే అప్ డేట్ ఇస్తూవ‌స్తున్నా. ఆయ‌న్ని ప‌ర్య‌వేక్షిస్తున్న డాక్ట‌ర్ల‌తో మాట్లాడిన త‌రవాతే.. నేను అప్ డేట్ ఇస్తున్నాను. అయితే ఈ రోజు ఉద‌య‌మే ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. నాన్న‌గారికి క‌రోనా నెగిటీవ్ అని ప్ర‌చారం మొద‌లైంది. అయితే.. నాన్న‌గారు ఆసుప‌త్రిలో చేరిన్ప‌పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఈ రూమ‌ర్లు న‌మ్మొద్దు. ఆయ‌న ఆరోగ్యంపై నేనే అప్ డేట్ ఇస్తుంటా“ అని క్లారిటీ ఇచ్చారు. దాంతో… క‌రోనాతో బాలు ఇంకా కోలుకోలేద‌ని, ఆయ‌న ఇంకా క‌రో్నాతో పోరాడుతున్నార‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. అయితే. ఈరోజు ఉద‌య‌మే.. చ‌ర‌ణ్ పేరుతో మీడియాకి ఓ అప్ డేట్ అందింది. `నాన్న‌గారు క‌రోనాని జ‌యించారు` అన్న‌ది ఆ అప్‌డేట్ సారాంశం. అదెలా పుట్టిందో? ఎవ‌రు పుట్టించారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close