వ్యాపారానికి వైరస్ : వెంటిలేటర్‌పై రియల్‌ఎస్టేట్..!

కోవిడ్ -19 ప్రభావం… ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా ప్రతీ వ్యాపారంపై పడింది. ప్రత్యక్షంగా కొన్ని తీవ్రంగా ప్రభావం అయితే.. అటు ప్రత్యక్షంగా.. ఇటు పరోక్షంగా కూడా.. దెబ్బ పడే రంగం.. రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాతైనా పుంజుకుంటుందా..అంటే… ఆర్థిక మాంద్యమే..,దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో .. పెట్టుబడిదారులు కానీ.. సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు కానీ..ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారు కానీ.. ముందడుగు వేస్తారని ఊహించడం కష్టం., అందుకే.. రియల్ ఎస్టేట్‌ను కోవిడ్ -19 వెంటిలేటర్‌పై ఉంచిందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

రియల్ ఎస్టెట్ ఇప్పుడు అన్‌ వాంటెడ్..!

కోవిడ్ -19 ప్రభావాన్ని భారత ప్రభుత్వం మార్చిలోనే ఎక్కువగా గుర్తించి చర్యలు తీసుకుంది. కానీ జనవరి నుంచి అంతర్జాతీయంగా కోవిడ్ -19 విస్తృతమవుతోంది. అప్పట్నుంచే భారతీయ రియల్ ఎస్టేట్‌పై ప్రభావం కనిపిస్తోంది. ఎన్నారైలు పెట్టుబడులు నిలిపివేశారు. ఆ రంగంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా.. వెనక్కి వెళ్లడంప్రారంభించాయి. దీంతో.. జనవరి నుంచి.. రియల్ ఎస్టేట్ డిమాండ్ 40 శాతం వరకూ పడిపోయింది. మెట్రో నగరాలు.. ఓ మాదిర పట్టణాల్లో రియల్ ఎస్టేట్.. ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. రేట్ల ధరల్లో కొంత హెచ్చతగ్గులు ఉన్నప్పటికీ.. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఇబ్బంది పడింది లేదు. కానీ ఇప్పుడు ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది. మరో పదిహేను రోజుల పాటు ఒక్క లావాదేవీ కూడా ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నదానిపై ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి.

జనవరి నుంచే సగానికి తగ్గిపోయిన డిమాండ్..!

దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెద్ద కంపెనీల దగ్గర్నుంచి చిన్న స్థాయి మేస్త్రీలు కట్టే ఇళ్ల వరకూ.. కొన్ని లక్షల ఇళ్లు రెడీగా ఉన్నాయి. వీటి అమ్మకాలపై కోవిడ్ -19 గట్టి దెబ్బకొట్టనుంది. డిమాండ్ సగానికి తగ్గడం ఖాయమని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారణంగా పెట్టుబడులు ఇరుక్కుపోవడంతో పాటు.. కొత్తగా పెట్టుబడులు వచ్చే అకాశం లేదని చెబుతున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు స్వర్ణయుగం నడుస్తోంది. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ కేవలం 2,680 యూనిట్లనే రియల్ ఎస్టేట్ కంపెనీలు అమ్మగలిగాయి. గత ఏడాది వీటి సంఖ్య 5,400 ఉంది. మరో రెండు నెలల పాటు.. ఇళ్ల అమ్మకాలు వందల్లోనే నమోదయ్యే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా.

మాంద్యం ముప్పులో ప్రపంచం..! ఇక కొనుగోళ్లుండవ్..!?

రియల్ ఎస్టేట్ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూంటాయి. రిస్క్ తక్కువ.. లాభం ఎక్కువ అని రియల్ ఎస్టేట్ రంగంలోకి సులువుగా.., వచ్చేస్తూంటారు. కొత్త కొత్త కాన్సెప్టులతో.. ఆధునిక తరానికి నచ్చేలా ఇళ్లను సిద్ధం చేసి..మార్కెట్ పెంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందరి ఆదాయాలపై కోవిడ్ -19 దెబ్బకొడుతోంది. జాగ్రత్తపడాలని హెచ్చరిస్తోంది. ప్రభుత్వాలే జీతాలు కోస్తున్నప్పుడు.. ప్రైవేటు సంస్థలు.. మొత్తం జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆర్థిక మాంద్యం ముప్పులో ప్రపంచం ఉండటంతో.. రియల్ ఎస్టేట్.. గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం ఖాయం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కూడా వెంటిలేటర్‌పై పడిపోయినట్లుగానే ఉంది. కోవిడ్ -19 విస్తృతి ఎంత ఎక్కువగా ఉంటే… రియల్ ఎస్టేట్ పరిస్థితి అంత క్లిష్టంగా మారుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close