ఏపీ స్పెషల్ : నిధులున్నా వాయిదాల పద్దతిలో జీతాలు..!

కేసీఆర్ తీసుకున్న మరో నిర్ణయాన్ని జగన్ ఫాలో అయిపోయారు. అదే ఉద్యోగుల జీతాల్లో సగం మేర కోత విధించడం. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు సిద్ధమైన ఏపీ సర్కార్.. ఆర్థిక శాఖ ద్వారా బిల్లులు సిద్ధం చేసింది. సీఎంఎఫ్‌ఎస్‌ ద్వారా ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు సిద్ధమయింది. కానీ.. కేసీఆర్ .. ఉద్యోగుల జీతాల్లో కోత విధించి.. రూ. 1700 కోట్లను ఆదా చేయాలని నిర్ణయించుకోవడంతో.. ఏపీ సర్కార్‌కు కూడా ఇదేదో బాగుందన్న ఆలోచన వచ్చినట్లుగా ఉంది.

బిల్లులన్నీ రెడీ అయినా నిలిపివేసి మరీ వేతనం కోత..!

ప్రభుత్వం జీతాల చెల్లింపులకు నిధులు సమీకరించుకుంది. ఒకటో తేదీ నుండి పదో తేదీ లోపు.. జీతాలు, పెన్షన్లు ఇతర పద్దుల కోసం దాదాపుగా రూ. ఆరు వేల కోట్లు చెల్లిస్తుంది. ఈ మేరకు ప్రిపేర్ చేసిన ఉద్యోగుల జీతాల బిల్లులను నిలిపివేసి.. కొత్తగా అందరికీ సగం .. సగం జీతాలిచ్చేలా బిల్లులను రెడీ చేయాలని.. అర్థరాత్రి సీఎస్ నీలం సహాని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాప్రతినిధులకు వంద శాతం జీతం వాయిదా వేశారు. ఆలిండియా సర్వీస్ అధికారులకు అరవై శాతం.. మిగతా వారికి యాభై శాతం జీతం తగ్గిస్తున్నారు. ఉద్యోగులు సహకరించాలని.. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారంటూ.. ఓ మెసెజ్‌ను ఉద్యోగులకు పంపుతున్నారు. అంతకు ముందు ఉద్యోగ సంఘాల నేతల్ని పిలిచి..జగన్ ఈ సమాచారం చెప్పారు. దానికి వారు అంగీకరించారు.

పరిస్థితి మెరుగుపడిన తర్వాత సగం జీతం..! అది ఎప్పుడు..?

సగానికి సగం తగ్గిస్తున్న జీతాల విషయంలో తెలంగాణ సర్కార్‌లా కాకుండా… కొంచెం క్లారిటీ ఇస్తున్నారు. తర్వాత చెల్లిస్తామని తెలంగాణ సర్కార్ చెప్పలేదు. కానీ ఏపీ సర్కార్ మాత్రం… పరిస్థితి మెరుగుపడిన తర్వాత చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇస్తోంది. పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయో.. ఎలా ఉంటే మెరుగుపడినట్లో మాత్రం వివరాలు జీవోలో లేవు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకూ సక్రమంగానే పని చేసింది. ఎక్సైజ్ శాఖ సహా … అన్ని రకాల ఆదాయాలు వచ్చాయి. ఉద్యోగుల నెల వారీ సైకిల్ హాజరీ 20వ తేదీతో ముగుస్తుంది. అంటే ఉద్యోగులందరూ.. నెల మొత్తం పని చేసినట్లే. ఈ పది రోజుల కాలంలో ఆదాయం తగ్గిపోతనే.. ఉద్యోగులకు సగం జీతాలు నిలిపివేయాలనుకోవడం.. సముచితం కాదని ఉద్యోగులు మథనపడుతున్నారు.

సలహాదారుల జీతాల గురించి ఎక్కడా చెప్పలేదేం..?

ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెద్ద ఎత్తున సలహాదార్లను నియమించుకుంది. వారికి తోడు సాక్షి సిబ్బందిని వివిధ సెక్షన్లలో ఔట్ సోర్సింగ్ కు తెచ్చుకుంది. వారి ఇప్పుడు… జీతాల కోత ఉత్తర్వులు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులకే వర్తించేలా జీవో ఉంది. ఈ సలహాదారులు… అధికార పార్టీ ద్వారా వచ్చిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా వర్తిస్తుందా అన్నదానిపై క్లారిటీ లేదు. ప్రభుత్వానికి గత పది రోజుల నుంచి మాత్రమే ఆదాయం ఆగిపోయింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా.. ఇద్దరు ముగ్గురు సలహాదార్లను ప్రభుత్వం నియమిచుకుంది. అమరావతి పై నియమించుకున్న బోస్టన్ అనే సంస్థకు రూ. ఏడు కోట్లు చెల్లించింది. మరిన్ని అత్యవసరం కాని చెల్లింపులూ జరిగాయి. అవన్నీ యధావిధిగా కొనసాగించి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సగానికి కట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఒకే సినిమా.. ఒకేరోజు.. రెండు ప్రారంభోత్స‌వాలు

సినిమా ప్రారంభోత్స‌వం అంటే.. ఓ పండ‌గ‌లాంటిదే. మంచి ముహూర్తం చూసుకుని, కొబ్బ‌రికాయ కొడ‌తారు. ఆ రోజున తొలి షాట్ తీసి శ్రీ‌కారం చుడ‌తారు. సాధార‌ణంగా ఏ అన్న‌పూర్ణ స్టూడియోలోనో, రామానాయుడు స్టూడియోలోనో, లేదంటే...

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

బాలీవుడ్‌లో పాగా.. ఇదే క‌రెక్ట్ టైమ్‌!

తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాత‌గా చ‌లామ‌ణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వ‌ర‌కే త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. చిన్న‌, పెద్ద‌, స్టార్‌, కొత్త‌.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు. నిర్మాణ...

HOT NEWS

[X] Close
[X] Close