జగన‌ చల్లని చూపు కోరుకుంటున్న సీపీఎం..!

ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టుల పయనం.. భిన్న కోణాల్లో సాగుతోంది. సీపీఐ యాంటీ జగన్ నినాదంతో దూసుకెళ్తుండగా.. సీపీఎం మాత్రం వైసీపీ నీడలో సేదదీరుతోంది. జగన్ నిర్ణయాల్ని సమర్థిస్తోంది. ఆ పార్టీకి వైసీపీ ఎక్కడా కనీస గౌరవం ఇచ్చినట్లుగా లేకపోయినా… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాత్రం… జగన్మోహన్ రెడ్డిని ఆరాధానాభావంతో చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీలో ఏ రాజకీయ పార్టీ కూడా సంతృప్తికరంగా లేదు. దాడులు, దౌర్జన్యాలు జరిగాయని ఆక్షేపించారు. అందుకే మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు జరపాలని కోరుతున్నారు.

అయితే సీపీఎం మాత్రం సైలెంట్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు వైసీపీకి అనుకూలంగా వాదన వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాలని.. అప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదని ఇప్పటికే తేలిపోయింది. అమరావతి విషయంలోనూ సీపీఎం తీరు ఇలాగే ఉంది. ఆ పార్టీ నేత బాబూరావు చురుగ్గా రాజధాని అమరావతికి మద్దతుగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. కానీ పార్టీ పరంగా మాత్రం మధు సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ సమావేశాల్లో రాజధాని అంశాన్ని చర్చించనీయడం లేదంటున్నారు.

అలాగే కోర్టులపై జగన్ సర్కార్ చేస్తున్న యుద్ధానికి సీపీఎం మద్దతు పలుకుతోంది. సీపీఎం మీడియా కోర్టు ధిక్కారం అవుతుందని తెలిసి కూడా పెద్ద ఎత్తున జగ్న లేఖకు కవరేజీ ఇచ్చింది. ప్రభుత్వంపై పోరాడి ప్రజల్లో పట్టు సాధించాలి కానీ.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలంటూ.. మధు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనకు జగన్ తో వ్యక్తిగతంగా సత్సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇలా అయితే కమ్యూనిస్టులు అంటే.. ఒక్క సీపీఐనే అన్న భావన కలుగుతుందన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close