“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట… పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రకటించింది. దీంతో.. ఆయన తన సొంత ప్రాంతం కడపలో ఏడాది కిందట శంకుస్థాపన చేసిన స్టీల్ ఫ్యాక్టరీని పోస్కో భాగస్వామ్యంతో నిర్మిస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ.. అసలు విషయం మాత్రం వేరే ఉందని చెబుతున్నారు. విశాఖ స్టీల్‌ను పోస్కోకు కట్టబెట్టాలన్న చర్చలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక సంఘాలు ఇప్పుడు ఈ విషయంపై ఆందోళనలు ప్రారంభించాయి.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను జాయింట్‌ వెంచర్‌ పేరుతో పోస్కో సంస్థకు కట్టబెట్టే ప్రయత్నాలు కొంత కాలంగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బిజెపి ప్రభుత్వానికి భయపడి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ భూములను అప్పగించడానికి సిద్ధమైందన్న ఆరోపణలను స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జరిగిన ఉద్యమంతో.. ఏపీ ప్రజలు స్టీల్ ప్లాంట్‌ను సాధించుకున్నారు. 7.3 మిలియన్‌ టన్నుల ప్లాంట్‌గా అభివృద్ధి సాధించింది. దాదాపు లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ని మరింతగా విస్తరించాలన్న డిమాండ్ ఎటూ ఉంది. దాని కోసం కావాల్సినన్ని భూములు ఉన్నాయి.అయితే ఆ భూములను పోస్కో సంస్థకు కేటాయించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

స్టీల్‌ప్లాంట్‌ భూములను పోస్కోకు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని స్టీల్‌ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి. త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రాణాలను కూడా లెక్క చేయబోమని వారంటున్నారు. పోస్కోతో చర్చల వివరాలను ముఖ్యమంత్రి బహిర్గతం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

'ఆచార్య‌' త‌ర‌వాత‌... 'వేదాళం' రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో 'వేదాళం' సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం`...

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

HOT NEWS

[X] Close
[X] Close