రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే చేతులు మిగలవు : సీపీఐ నారాయణ

కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి అగ్రెసివ్ మార్గాన్ని ఎంచుకుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నిర్ణయంపై దూకుడుగా వెళ్లి రైతాంగంలో మద్దతు పెంచుకుని ఓటు బ్యాంక్‌ను ప్రభావవంతంగా పెంచుకోవాలి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీపీఐ ఈ విషయంలో మరింత ఫాస్ట్‌గా ఉంది. బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడంతో దూకుడుగా ఉండే సీపీఐ నేత నారాయణ ఈ విషయంలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మీటర్లు బిగించడానికి వచ్చే వాడి చేతులు మిగలవని హెచ్చరికలు జారీ చేశారు.

సీఎంకు చేతనైతే విద్యుత్‌ మీటర్లు బిగించి చూడాలని కూడా సవాల్ చేశారు. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో ఉచిత విద్యుత్‌ను సాధించుకుంటే.. ఆయన కొడుకే దానికి మంగళం పాడుతున్నాడని మండిపడ్డారు. విద్యుత్ మీటర్ల విషయంలో ఇప్పటికే రైతుల్లో ఆందోళన ప్రారంభమయింది. కేంద్రం తప్పనిసరిగా పెట్టాలంటోందని ప్రభుత్వం తన వాదనగా చెబుతున్నప్పటికీ..పొరుగు రాష్ట్రం తెలంగాణ మంత్రులు మాత్రం..కేవలం రూ.నాలుగు వేలకోట్ల కోసం జగన్ …రైతుల గొంతు కోస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలకు తోడు మీటర్లు పెడితే వచ్చే అనేక సమస్యలు రైతుల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. దీంతో వారు కూడా వ్యతిరేకిస్తున్నారు.

ఈ వ్యతిరేకతను అండగా చూసుకుని రాజకీయ పార్టీలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. మీటర్లు పెడితే కాలబెడతామని.. శ్రీకాకుళం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని గతంలోనే కమ్యూనిస్టులు ప్రకటించారు. ఇప్పుడు పెట్టి చూడండి అని సవాల్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడంతో దూకుడుగా ఉంటారు. మరి ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటే ఏం చేస్తుందో..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close